Share News

ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

ABN , Publish Date - Nov 17 , 2025 | 11:13 PM

ప్రజా సంక్షేమమే ప్రభు త్వ లక్ష్యమని కల్వకుర్తి ఎమ్మెల్యే కశిరెడ్డి నారా యణరెడ్డి అన్నారు.

ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
బస్సు సర్వీస్‌ను ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయణరెడ్డి

- కల్వకుర్తి ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయణరెడ్డి

కల్వకుర్తి, నవంబరు 17 (ఆంధ్రజ్యోతి) : ప్రజా సంక్షేమమే ప్రభు త్వ లక్ష్యమని కల్వకుర్తి ఎమ్మెల్యే కశిరెడ్డి నారా యణరెడ్డి అన్నారు. ఎ న్నికల్లో ఇచ్చిన హామీ మే రకు మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్ర యాణం సదుపాయం కల్పించడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. సోమవారం కల్వకుర్తి ప ట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్‌ నుంచి గచ్చిబౌలికి డీలక్స్‌ సర్వీస్‌ను, శ్రీశైలానికి ఎక్స్‌ప్రెస్‌ సర్వీస్‌ను జడ్పీ మాజీ వైస్‌ చైర్మన్‌ ఠాకూర్‌ బాలాజీ సింగ్‌ తో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. ఎమ్మెల్యే కొద్దిసేపు బస్సును నడిపారు. కార్యక్రమంలో కల్వకుర్తి మాజీ సర్పంచ్‌ బృంగి ఆనంద్‌కుమా ర్‌, జిల్లా ఎస్సీ, ఎస్టీ మానిటరింగ్‌ కమిటీ సభ్యు డు జిల్లెల రాములు, మార్కెట్‌ కమిటీ చైర్‌ప ర్సన్‌ ఉమామనీలా సంజీవ్‌కుమార్‌ యా దవ్‌, మాజీ కౌన్సిలర్‌ ఎజాస్‌, డిపో మేనేజర్‌ సుభాషి ణి, అసిస్టెంట్‌ డిపో మేనేజర్‌ శ్వేత, కాంగ్రెస్‌ పట్టణ అధ్యక్షుడు చిమ్ముల శ్రీకాంత్‌రెడ్డి తదితరులు ఉన్నారు.

ప్రజా సంక్షేమానికి పాటుపడతా : ఎమ్మెల్యే

వెల్దండ, (ఆంధ్రజ్యోతి) : ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా వారి సంక్షేమానికి శక్తివంచన లేకుండా పనిచేస్తానని ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. సోమవారం మండలకేంద్రంలో నిర్వహించిన పలు కార్యక్రమాలలో నారాయణరెడ్డి పాల్గొన్నారు. సింగిల్‌విండో ద్వారా ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించారు. 75 మంది లబ్ధిదారులకు కలాళ్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. కొండకత్వ కుంటలో చేపపిల్లల వదిలారు. ఇందిరమ్మ ఇంటి పనులను పరిశీలించారు. విద్యుత్‌ దీపాను ప్రారంభోత్సవకార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ అన్నివర్గాల అభ్యున్నతికి ప్రభుత్వం పని చేస్తున్నదని అన్నారు. కార్యక్రమంలో పీసీబీ సభ్యుడు బాలాజీసింగ్‌, నాయకులు మోతీలాల్‌, భూపతిరెడ్డి, పర్వత్‌రెడ్డి, వెంకటయ్యగౌడ్‌, సంజీవ్‌కుమార్‌, కేశమళ్ల కృష్ణ, రాజశేఖర్‌, రషీద్‌, పుల్లయ్య, శ్రీనివాస్‌యాదవ్‌, ఎంపీడీవో సత్యపాల్‌రెడ్డి, డీటీ కిరణ్‌కుమార్‌, ఏవో శోభ, సీఈవో శ్రీనివాసులు, పురుషోత్తమాచారి, ఎర్ర శ్రీను, నారాయణ, వెంకటమ్మ ఉన్నారు.

Updated Date - Nov 17 , 2025 | 11:13 PM