Share News

kumaram bheem asifabad- ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ పాఠశాల

ABN , Publish Date - Nov 14 , 2025 | 10:06 PM

విద్యార్థు లను అన్ని రంగాల్లో తీర్చిదిద్దాలనే తపన, మార్పు లను ఆహ్వానిస్తూ కొత్త సాంకేతికతను అందిపుచ్చు కుంటూ పిల్లలకు అందించాలనే ఆలోచన, ఆచరణ ఆ పాఠశాలను కార్పొరేట్‌కు దీటుగా నిలబెడుతోంది. సహచర ఉపాధ్యాయుల బృందం సమష్టి కృషితో నేడు రాష్ట్ర, జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చేలా చేసింది.

kumaram bheem asifabad- ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ పాఠశాల
అవార్డు అందుకుంటున్న ఉపాధ్యాయుడు కడేర్ల రంగయ్య(ఫైల్‌)

- ఆదర్శంగా నిలుస్తున్న సావర్‌ఖేడ పాఠశాల

కెరమెరి, నవంబరు 14 (ఆంధ్రజ్యోతి): విద్యార్థు లను అన్ని రంగాల్లో తీర్చిదిద్దాలనే తపన, మార్పు లను ఆహ్వానిస్తూ కొత్త సాంకేతికతను అందిపుచ్చు కుంటూ పిల్లలకు అందించాలనే ఆలోచన, ఆచరణ ఆ పాఠశాలను కార్పొరేట్‌కు దీటుగా నిలబెడుతోంది. సహచర ఉపాధ్యాయుల బృందం సమష్టి కృషితో నేడు రాష్ట్ర, జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చేలా చేసింది. ఇటీవల హైదరాబాద్‌లోని రాష్ట్ర విద్యాశాఖ నిర్వహించిన మల్టీ జోన్‌-1లోని పీఎంశ్రీ పాఠశాలలో కుమరం భీం జిల్లా కెరమెరి మండలం సావర్‌ఖేడ ప్రాథమిక పాఠశాల ఎంపికైన నేపథ్యంలో స్ఫూర్తిదాయక కథనం..

సావర్‌ఖేడ పాఠశాలలో 2010లో కడేర్ల రంగయ్య ఉపాధ్యాయుడిగా తొలిసారి ఉద్యోగంలో చేరారు. అప్పటి నుంచి పాఠశాల అభివృద్ధిలో విశేష కృషి చేస్తున్నారు. డిజిటల్‌ బోధన, పీఎంశ్రీ పథకంలో భా గంగా విద్యార్థులకు విహార యాత్రలు, క్షేత్ర పర్యట నలు, సహచర ఉపాధ్యాయులతో వినూత్నంగా విద్యనందిస్తూ రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఆదర్శంగా నిలిచేలా కృషి చేస్తున్నారు. భర్తతో పాటు ఉచితంగా విద్యా బోధిస్తున్న ఆయన సతీమణి వీణ ఇటీవల ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రేతుల మీదుగా ప్రత్యేక సత్కారం అందుకున్నారు.

ప్రత్యేక శిక్షణ..

నవోదయ, గురుకులాల్లో సీట్లు సాధించేందుకు సెలవుల్లో సైతం విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇస్తూ సన్నద్ధం చేస్తున్నారు. ఇప్పటి వరకు ఆయా గురు కులాల్లో మొత్తం 190 మంది విద్యార్థులు, చుక్క రామయ్య సంస్థలో 20, నవోదయలో ఒకరు, ప్రత్యేక గురుకులాల్లో (స్కూల్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌)లో ఐదుగురు సీట్లు సాధించారు. కాగా పాఠశాల అభివృద్ధిలో గ్రామ స్థుల భాగస్వామ్యం కూడా ఉంది. ప్రొజెక్టర్‌, రెండు టీవలు, 120 కుర్చీలు, 35 బెంచీలు, మూడు కంప్యూ టర్లు, విద్యార్థులకు ఐడీ కార్డులు, టై, బెల్టులు, బూట్లు తదితరాలు సమకూర్చారు. ‘సార్‌’ చిత్ర పరిశ్రమ బృందం ఆధ్వర్యంలో రూ.3 లక్షలు విరాళం అందజే శారు. పాఠశాలలో ప్రవేశ, పోటీ పరీక్షలకు ఉపయో గపడే విధంగా గ్రంథాలయం ఏర్పాటు చేశారు. విద్యా ర్థులకు డిజిటల్‌ బోధన చేస్తూ తీర్చిదిద్దుతున్నారు.

Updated Date - Nov 14 , 2025 | 10:06 PM