Share News

విద్యుత్‌ సమస్యల పరిష్కారానికే ప్రజాబాట

ABN , Publish Date - Nov 06 , 2025 | 11:24 PM

గ్రామాలలో నెలకొన్న విద్యుత్‌ సమస్యలు పరిష్కరించేందుకే ప్రజాబాట కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ట్రాన్స్‌కో ఎస్‌ఈ వెంకట నర్సింహారెడ్డి తెలిపారు.

విద్యుత్‌ సమస్యల పరిష్కారానికే ప్రజాబాట
వెల్దండలో సమస్యలను తెలుసుకుంట్ను ఎస్‌ఈ నర్సింహారెడ్డి

- ట్రాన్స్‌ఫార్మర్లను పరిశీలించిన ట్రాన్స్‌కో ఎస్‌ఈ వెంకట నర్సింహారెడ్డి

వెల్దండ, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి) : గ్రామాలలో నెలకొన్న విద్యుత్‌ సమస్యలు పరిష్కరించేందుకే ప్రజాబాట కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ట్రాన్స్‌కో ఎస్‌ఈ వెంకట నర్సింహారెడ్డి తెలిపారు. గురువారం మండల కేంద్రంలో నిర్వహించిన ప్రజాబాట కార్యక్రమంలో ఆయన పాల్గొని విద్యుత్‌ సిబ్బందితో కలిసి గ్రామంలో పర్యటించి విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్లను పరిశీలించి, స్థానికులను సమస్యలు అడిగితెలుసుకున్నారు. గ్రామాలలో విద్యుత్‌ లోవోల్టేజీ సమస్యలు రాకుండా అవసరమైన మేర ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేయాలని సూచించారు. ఇళ్లపై ఉన్న విద్యుత్‌ వైర్లను తొలగించాలని, వేలాడుతున్న వైర్లను సవరించాలని అన్నారు. వేలాడుతున్న వైర్లను సరిచేసేందుకు విద్యుత్‌ పోల్స్‌ ఏర్పాటు చేయాలన్నారు. గ్రామంలో ని విద్యుత్‌ సమస్యలను పీఏసీఎస్‌ డైరెక్టర్‌ మట్ట వెంకటయ్యగౌడ్‌, పీఏసీఎస్‌ వైస్‌ చైర్మన్‌ రాజేందర్‌రెడ్డి ఎస్‌ఈ దృష్టికి తీసుకెళ్లారు. కార్యక్రమంలో ఎస్‌ఏవో పార్థసారధి, లైన్‌మన్‌లు లక్ష్మణ్‌, లష్కర్‌ ఉన్నారు.

ఫ చారకొండ (ఆంధ్రజ్యోతి) : మండల కేం ద్రంలో విద్యుత్‌ సమస్య పరష్కారానికి కృషి చేస్తామని విద్యుత్‌శాఖ ఏఈ జానకీరాంనాయక్‌ అన్నారు. గురువారం మండల కేంద్రంలోని క్వాటర్స్‌లో స్థానిక నాయకులతో కలిసి ఏఈ కాలనీ వాసులతో మాట్లాడి విద్యుత్‌ సమస్యల ను అడిగి తెలుసుకున్నారు. అవసరమైన చోట కొత్త స్తంభాలను ఏర్పాటు చేసి, వేలాడుతున్న వైర్లను సరిచేస్తామని పేర్కొన్నారు. ఆయన వెం ట బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు గుండెవెంకట్‌ గౌడ్‌, కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు బాల్‌రాంగౌడ్‌, నాయకులు జేసీబీ వెంకటయ్యగౌడ్‌, వెంకట్‌రెడ్డి, లైన్‌ ఇన్‌స్పెక్టర్‌ కస్ననాయక్‌, లైన్‌మన్‌ బాలు నాయక్‌, అసిస్టెంట్‌ లైన్‌మన్‌ శ్రీశైలం ఉన్నారు.

Updated Date - Nov 06 , 2025 | 11:24 PM