ప్రజావాణి దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి
ABN , Publish Date - Nov 10 , 2025 | 11:11 PM
ప్రజావాణి కార్యక్రమంలో అందిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వర గా పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కుమార్ దీప క్ అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో ఆర్జీ దారుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు.
మంచిర్యాల కలెక్టరేట్, నవంబరు 10 (ఆంధ్రజ్యోతి) : ప్రజావాణి కార్యక్రమంలో అందిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వర గా పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కుమార్ దీప క్ అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో ఆర్జీ దారుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. మందమర్రి, సారంగపల్లి, బెల్లంపల్లి, లక్షెట్టిపేట, మంచిర్యాల, హాజీపూర్ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు దరఖాస్తులు అందించారు. తలసేమియా సికిల్ సెల్ సొసైటి ప్రతినిధులు తలసేమియా వ్యాధిగ్రస్తులకు సదరం శిబిరాల ను నిర్వహించి పింఛన్‌లు అందించాలన్నారు. ఈ సందర్భంగా కలె క్టర్ మాట్లాడుతూ ప్రజావాణి కార్యక్రమంలో అందిన దరకాస్తులను త్వరగా పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చంద్రయ్య, ఆర్డీవో శ్రీనివాసరావు పాల్గొన్నారు.
ఫబీఆర్‌ఎస్‌ప్రభుత్వం హయంలో నిర్మించిన 300 డబుల్‌బెడ్ రూం ఇళ్లను తక్షణమే ప్రభుత్వం పేదలకు అందించాలని బీఆర్‌ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం జిల్లా కలెక్టరేట్ కార్యాల యం ఎదుట ఆందోళన నిర్వహించి కలెక్టర్‌కు వినతి పత్రం అందిం చారు. పట్టణాధ్యక్షుడు గాదె సత్యం, నాయకులు సుధీర్, రవీందర్ రెడ్డి, సాగర్ తదితరులు పాల్గొన్నారు.
రైతుల సౌకర్యం కోసం కంట్రోల్ రూమ్ ఏర్పాటు
రైతుల సౌకర్యం కోసం కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ పేర్కొన్నారు. సోమవారం సమీకృత కలెక్టరేట్ సముదాయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్‌ను కలెక్టర్ ప్రారం భించి మాట్లాడారు. రైతుల సౌకర్యం కోసం కంట్రోల్ రూమ్ నెంబర్ 6303928682ను ఏర్పాటు చేశామన్నారు. రాష్ట్రస్థాయిలో 1967, 180042500333 ఉన్నాయన్నారు.సందేహాలు, ఫిర్యాదులు ఉంటే తెలియజేయాలన్నారు.