ప్రజావాణి దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలి
ABN , Publish Date - May 26 , 2025 | 11:10 PM
ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరగా పరిష్కరించే విధంగా అధికారుల సమన్వయంతో చర్యలు తీసుకుంటామని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. సోమ వారం సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలో ఆర్జీదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు.
కలెక్టర్ కుమార్ దీపక్
మంచిర్యాలకలెక్టరేట్, మే26(ఆంఽధ్రజ్యోతి): ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరగా పరిష్కరించే విధంగా అధికారుల సమన్వయంతో చర్యలు తీసుకుంటామని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. సోమ వారం సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలో ఆర్జీదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. నెన్నె ల మండలం నర్వాయిపేట గ్రామానికి చెందిన జాడిశంకర్ మండలంలోని మెట్‌పల్లి శివారులో తనకు గల పట్టా భూమి వేరొకరి పేరిట చూపుతోదని, సవరించి తన పేరిట మార్పు చేసి పట్టాపాసు పుస్తకం ఇప్పించాలని కోరుతూ దరఖాస్తు అం దజేశారు. హాజీపూర్ మండలం ముల్కల్ల గ్రామానికి చెందిన బోయిన రవీందర్, నెన్నెల మండలం మెట్‌పల్లి గ్రా మానికి చెందిన దుగుట రాజేశ్వరి తమ ప్రాంతంలో మీ సేవా కేంద్రం లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, మీసేవా కేంద్రం ఏర్పాటు చేసేందుకు అనుమతి మంజూరు చేయాలని కోరుతూ ఆర్జి సమర్పించారు. జన్నారం మండలం ఇంధ న్‌పల్లి గ్రామానికి చెందిన లసెట్టి గంగవ్వ గ్రామ శివారులో తనకు గల భూమికి సంబంధించి హద్దులు నిర్ధారించాలని కోరుతూ ఆర్జీ సమర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణి కార్యక్రమంలో 32 దరఖాస్తులు వచ్చా యని, అందిన దరఖాస్తులు క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరితగతిన పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారు లు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
జిల్లా అదనపు కలెక్టర్ సభావత్ మోతిలాల్, మంచిర్యాల, బెల్లంపల్లి రాజస్వ మండల అధికారులు శ్రీనివాస్‌రావు, హరిక్రిష్ణలతో కలిసి