Share News

ఓట్‌ చోరీపై ప్రజలకు అవగాహన

ABN , Publish Date - Oct 11 , 2025 | 11:44 PM

దేశ వ్యాప్తంగా జరుగుతున్న ఓట్‌ చోరీపై ప్రజల్లో అవగాహన కల్పించే కార్యక్రమానికి కాంగ్రెస్‌ అధినేత రాహుల్‌గాంధీ పిలుపు మేరకు రా ష్ట్రంలో కూడా ఓట్‌ చోరీపై అవగాహన కార్యక్రమం చేపడుతున్నామని రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన గనుల శాఖ మంత్రి వివేక్‌వెంకటస్వామి తెలిపారు.

ఓట్‌ చోరీపై ప్రజలకు అవగాహన
మాట్లాడుతున్న మంత్రి వివేక్‌వెంకటస్వామి

మంత్రి వివేక్‌వెంకటస్వామి

మందమర్రిటౌన్‌, అక్టోబరు 11 (ఆంధ్రజ్యోతి) : దేశ వ్యాప్తంగా జరుగుతున్న ఓట్‌ చోరీపై ప్రజల్లో అవగాహన కల్పించే కార్యక్రమానికి కాంగ్రెస్‌ అధినేత రాహుల్‌గాంధీ పిలుపు మేరకు రా ష్ట్రంలో కూడా ఓట్‌ చోరీపై అవగాహన కార్యక్రమం చేపడుతున్నామని రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన గనుల శాఖ మంత్రి వివేక్‌వెంకటస్వామి తెలిపారు. శనివారం పట్టణంలోని బెల్లంపల్లి, మందమర్రి, మంచిర్యాల, గోదావరిఖని నాలుగు రోడ్ల కూడలి జాతీయ రహదారిపై ఓట్‌ చోరీ సంతకాల సేక రణ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు సంతకాలు చేశారు. మంత్రి మాట్లాడుతూ దేశంలో కాంగ్రెస్‌ పార్టీ బలంగా ఉన్న రాష్ట్రాల్లో ఓట్‌ చోరీ జరుగుతుందన్నారు. ఈవీఎంలపై అనేక అనుమానాలు ఉన్నాయని తమ అధినేత రాహుల్‌గాంధీ పదే పదే ఆరోపి స్తున్నారన్నారు. దీనికి సంబంధించి ఆయా రాష్ట్రాల్లో గురైన ఓట్ల చోరీకి సంబంధించి పవర్‌ పా యింట్‌ ప్రజంటేషన్‌ ఇచ్చామన్నారు. చీఫ్‌ ఎన్నికల కమీషన్‌ కూడా తమకు ఉన్న అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాద్యత ఉందన్నారు. రాష్ట్రంలో చేపట్టిన ఈ కార్యక్రమానికి ప్రజలు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ నాయకులు పాల్గొన్నారు.

రామకృష్ణపూర్‌లోని కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయం వద్ద ఓట్ల చోరీ అవగాహన కార్యక్రమానికి మంత్రి వివేక్‌వెంకటస్వామి హాజరై మాట్లాడారు. కేంద్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి రాకుండా ఉండేందుకు ఓట్ల చోరీ జరుగుతుందన్నారు. ఒక్కో కుటుంబంలో 70 ఓట్ల వరకు నమోదు కావడం ఆశ్చర్యంగా ఉందని తెలిపారు. దీనిపై చీఫ్‌ ఎన్నికల సంఘం దృష్టి సారించాలన్నారు. నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - Oct 11 , 2025 | 11:44 PM