నాణ్యమైన ఏకరూప దుస్తులు అందించాలి
ABN , Publish Date - Apr 09 , 2025 | 11:30 PM
ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు జూన్ మొదటి వారంలోగా పాఠశాలలకు కేటాయించిన మేర నాణ్యమైన ఏకరూప దుస్తులు అందించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు.

కలెక్టర్ కుమార్ దీపక్
మంచిర్యాల కలెక్టరేట్, ఏప్రిల్ 9 (ఆంధ్రజ్యోతి) : ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు జూన్ మొదటి వారంలోగా పాఠశాలలకు కేటాయించిన మేర నాణ్యమైన ఏకరూప దుస్తులు అందించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. బుధవారం కలెక్టరేట్ కార్యాలయంలో డీఈవో యాదయ్య, డీఆర్‌డీవో కిషన్‌తో కలిసి ఎంఈవోలు, ఏపీ ఎంలతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఏకరూప దుస్తుల తయారీ ప్రక్రియను వేగవంతం చేయా లని, మే నెల 20లోగా దుస్తులు సిద్ధం చేసే విధంగా అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. ఏకరూప దు స్తుల తయారీ కోసం మహిళా స్వయం సహాయక సంఘాలకు అవకాశం కల్పించామని, కొన్ని ప్రాంతాల్లో కుట్టు మిష న్‌లను కూడా అందించామన్నారు. ఒక జత దుస్తులకు రూ. 75 చెల్లిస్తామని, నాణ్యతతో దుస్తులను కుట్టాలని సూ చించారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ సమన్వయకర్త చౌదరి, అధికారులు పాల్గొన్నారు.