Share News

kumaram bheem asifabad- విద్యార్థులకు నాణ్యమైన బోధన అందించాలి

ABN , Publish Date - Nov 13 , 2025 | 10:11 PM

ప్రభుత్వ పాఠశాలల్లో చదువు తున్న విద్యార్థులకు నాణ్యమైన విద్యబోధన అందించాలని అదనపు కలెక్టర్‌, ఇన్‌చార్జి డీఈవో దీపక్‌ తివారి అన్నారు. మండలంలోని అంకుశాపూర్‌ గ్రామ పంచాయతీ తేలిగూడ గ్రామంలోని మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాలను గురువారం సందర్శించారు. మధ్యాహ్న భోజనంలో మెనూ, తరగతి గదులు, రిజిస్టర్లు, పాఠశాల పరిసరాలను పరిశీలించారు

kumaram bheem asifabad- విద్యార్థులకు నాణ్యమైన బోధన అందించాలి
ఇందిరమ్మ ఇళ్లను పరిశీలిస్తున్న అదనపు కలెక్టర్‌ దీపక్‌ తివారి

ఆసిఫాబాద్‌రూరల్‌, నవంబరు 13 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పాఠశాలల్లో చదువు తున్న విద్యార్థులకు నాణ్యమైన విద్యబోధన అందించాలని అదనపు కలెక్టర్‌, ఇన్‌చార్జి డీఈవో దీపక్‌ తివారి అన్నారు. మండలంలోని అంకుశాపూర్‌ గ్రామ పంచాయతీ తేలిగూడ గ్రామంలోని మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాలను గురువారం సందర్శించారు. మధ్యాహ్న భోజనంలో మెనూ, తరగతి గదులు, రిజిస్టర్లు, పాఠశాల పరిసరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేసి విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సదుపా యాలు కల్పించి నాణ్యమైన విద్యను అందించామని తెలిపారు. ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. పాఠశాలలో మెనూ ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన ఆహారాన్ని అందించాలని చెప్పారు. ఆహారం తయారీ సమయంలో పరిశుభ్రత నిబంధనలు పాటించాలన్నారు. విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో ఉపాధ్యాయులు విద్యాబోధన చేయాలని, తరగతిలో వెనకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. అనంతరం గ్రామ పంచాయతీలో ఇందిరమ్మ ఇళ్ల పనుల పురోగతిని పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. లబ్ధిదారులకు ఇండ్లు నిర్మాణ పనులను వేగవంతం చేయాలని, నిబంధనల ప్రకారం నిర్ణీత విస్తీర్ణంలో ఇల్లు నిర్మించుకునేలా లబ్ధిదారులకు అవగాన కల్పించాలని తెలిపారు. ఆయన వెంట ఎంపీడీఓ శ్రీనివాస్‌, కార్యదర్శి కవిత, ఉపాధ్యాయులు తదితరులు ఉన్నారు.

Updated Date - Nov 13 , 2025 | 10:11 PM