విద్యార్థులకు నాణ్యమైన ఆహారాన్ని అందించాలి
ABN , Publish Date - Jul 27 , 2025 | 12:04 AM
ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలలు, సం క్షేమ వసతిగృహాల్లోని విద్యార్థులకు నాణ్యమైన ఆహారాన్ని అందించాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శనివారం ఉదయం పట్టణంలోని సెడ్యూల్డ్ కులాలు సంక్షేమ కళాశాల బాలికల వస తి గృహాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి విద్యార్థులకు అందిస్తున్న అల్ఫాహారం, నాణ్యత వసతి గృహ పరిసరాలను పరిశీలించి మెస్ కమిటీ సభ్యులతో రోజువారి ఆహారపట్టిక అమలుపై వివ రాలు అడిగి తెలుసుకున్నారు.
కలెక్టర్ కుమార్ దీపక్
మంచిర్యాలక్రైం, జూలై26 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలలు, సం క్షేమ వసతిగృహాల్లోని విద్యార్థులకు నాణ్యమైన ఆహారాన్ని అందించాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శనివారం ఉదయం పట్టణంలోని సెడ్యూల్డ్ కులాలు సంక్షేమ కళాశాల బాలికల వస తి గృహాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి విద్యార్థులకు అందిస్తున్న అల్ఫాహారం, నాణ్యత వసతి గృహ పరిసరాలను పరిశీలించి మెస్ కమిటీ సభ్యులతో రోజువారి ఆహారపట్టిక అమలుపై వివ రాలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులతో కలిసి అల్పాహారం చేశారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యారంగాన్ని బలోపేతం చేస్తూ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతుంద న్నారు. అమ్మ ఆదర్శపాఠశాల కమిటీ ఆధ్వర్యంలో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో తాగునీరు, విద్యు త్, మూత్రశాలలు అన్ని సదుపాయాలు కల్పించి నాణ్యమైన విద్యను అందిస్తుందన్నారు. వి ద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన, రుచికరమైన ఆహారం అందిస్తుందన్నారు. ఆహారం త యారీలో తాజా కూరగాయాలు, నిత్యావసర సరుకులు వినియోగించాలని విద్యార్థులకు వేడి భోజనం, శుద్ధమైన తాగునీరు అందించాలన్నారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులపట్ల అప్రమ త్తంగా ఉండాలని వసతిగృహాన్ని పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. అధికారులు ఎప్పుడు అందుబాటులో ఉండాలని సూచించారు. వసతి గృహంలో నెలకొన్న సమస్య ఎప్పటికప్పుడు తమ దృష్టికి తీసుకరావాలని వసతి గృహంలో నెలకొన్న నీటి సమస్య కలెక్టర్ దృష్టికి తీసుక రా గా బోర్‌వెల్ మంజూరు చేసి సమస్యను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని తెలి పారు. అనంతరం సాయికుంటలోని ప్రభుత్వ గిరిజన సంక్షేమ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసి అందులో సదుపాయాలను పరిశీలించారు. విద్యార్థుల ఆరోగ్యంపట్ల ప్రత్యేక శ్రద్ధ వహిం చాలని వర్షాకాలంలో విద్యార్థులు జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్యంపట్ల అవగాహన కల్పించాల ని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా షెడ్యూల్డ్ కులముల అభివృద్దిశాఖ ఉప సంచాలకులు దుర్గాప్రసాద్, సహాయ సాంఘీక సంక్షేమ అధికారి రవీందర్, వసతిగృహ సంక్షేమ అధికారి చందన పాల్గొన్నారు.