kumaram bheem asifabad- విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలి
ABN , Publish Date - Dec 18 , 2025 | 10:26 PM
ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాలలో విద్య అభ్యసిస్తున్న విద్యార్థులకు సకల సదుపాయాలతో కూడిన నాణ్యమైన విద్య అందించే దిశగా ప్రభుత్వం కృషి చేస్తుందని అదనపు కలెక్టర్, డీఈవో దీపక్ తివారి అన్నారు. గురువారం వాంకిడి మండలం గోయగాం గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను సందర్శించి తరగతి గదులు, ప్రీ ప్రైమరీ విభాగం, విద్యార్థుల మాజరు, బోధన ప్రమాణాలు , మౌలిక వసతుల కల్పన, అభివృద్ధి పనుల అంశాలను పరిశీలించారు.
వాంకిడి, డిసెంబరు 18 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాలలో విద్య అభ్యసిస్తున్న విద్యార్థులకు సకల సదుపాయాలతో కూడిన నాణ్యమైన విద్య అందించే దిశగా ప్రభుత్వం కృషి చేస్తుందని అదనపు కలెక్టర్, డీఈవో దీపక్ తివారి అన్నారు. గురువారం వాంకిడి మండలం గోయగాం గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను సందర్శించి తరగతి గదులు, ప్రీ ప్రైమరీ విభాగం, విద్యార్థుల మాజరు, బోధన ప్రమాణాలు , మౌలిక వసతుల కల్పన, అభివృద్ధి పనుల అంశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలను విద్యార్థులకు అవసరమైన మౌలిక సదుపాయాలు, తాగునీరు, విద్యుత్, మూత్రశాలలు, సౌచాలయాలు, వంట శాల, ప్రహారి గోడ, ఇతర సదుపాయాలు కల్పించి నిష్ణాతులైన ఉపాధ్యాయుల ద్వారా నాణ్యమైన విద్యాబోధన అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. విద్యార్థులకు మెనూ ప్రకారం సకాలంలో పౌషిటక ఆహారం, శుద్ధమైన తాగునీటిని అందించాలని, వారి ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు. విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో విద్యాబోదన చేయాలని, తరగతిలో వెనకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. అనంతరం మండల కేంద్రంలోని జిల్లా పరిషత ఉన్నత పాఠశాలను సందర్శించి పాఠశాల రికార్డులు, హాజరు పట్టికలు, సమగ్ర శిక్ష విధానాలను సమీక్షించారు. పాఠశాలలో పదో తరగతి విద్యార్థుల కోసం నిర్వహిస్తున్న ప్రత్యేక తరగతులపై దృష్టి సారించాలని చెప్పారు. పరీక్షల దృష్ట్యా ప్రత్యేక విద్యాబోధన అందించాలని తెలిపారు. అదనపు గదులు, అద్యయన సామగ్రి ఇతర మౌలిక వసతులను కల్పించాలని, విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా సకల సదుపాయాల నడుమ ఏకాగ్రతతో విద్య అభ్యసించేలా వాతావరణం కల్పించాలని తెలిపారు. విద్యార్థులు వార్షిక పరీక్షలలో ఉత్తమ ఫలితాలు సాధించేలా అవసరమైన ఏర్పాట్లు చేయాలని తెలిపారు.