Share News

kumaram bheem asifabad-విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలి

ABN , Publish Date - Jul 26 , 2025 | 11:14 PM

ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాలలో విద్యనభ్యసిస్తున్న విద్యార్థులకు నాణ్యమైన విద్య, రుచికరమైన ఆహారం అందించడంతో పాటు వారి ఆరోగ్యం పట్ల ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే అన్నారు. కాగజ్‌నగర్‌లోని పెట్రోల్‌ పంపు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల, ఆగ్రోస్‌ ఫర్టిలైజర్స్‌, జడ్పీ పాఠశాలను సబ్‌ కలెక్టర్‌ శ్రద్ధా శుక్లాతో కలసి శనివారం సందర్శించారు.

kumaram bheem asifabad-విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలి
పాఠశాలలో మంచినీటి కుళాయిలు పరిశీలిస్తున్న కలెక్టర్‌

కాగజ్‌నగర్‌టౌన్‌, జూలై 26 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాలలో విద్యనభ్యసిస్తున్న విద్యార్థులకు నాణ్యమైన విద్య, రుచికరమైన ఆహారం అందించడంతో పాటు వారి ఆరోగ్యం పట్ల ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే అన్నారు. కాగజ్‌నగర్‌లోని పెట్రోల్‌ పంపు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల, ఆగ్రోస్‌ ఫర్టిలైజర్స్‌, జడ్పీ పాఠశాలను సబ్‌ కలెక్టర్‌ శ్రద్ధా శుక్లాతో కలసి శనివారం సందర్శించారు. పాఠశాల పరిసరాలు, తాగునీటి కుళాయిలు, తరగతి గదులు, విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనం, వంటశాలను పరిశీలించారు. మెనూ ప్రకారం విద్యార్థులకు పోషక విలువలు కలిగిన ఆహారాన్ని అందించాలని సూచించారు. అనంతరం ఎల్లాగౌడ్‌ తోటలోని ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేశారు. జ్వరంతో బాధపడుతూ చికిత్స పొందుతున్న రోగులతో మాట్లాడారు. ఆసుపత్రిలోని అన్ని వార్డులను పరిశీలించారు. ఇన్‌ పేషెంట్‌, ఔట్‌ పేషంట్‌ సేవలు, మందుల అందుబాటు వివరాలు ఆరా తీశారు. అలాగే మార్కెట్‌లోని మన ఆగ్రోస్‌ ఫర్టిలైజర్‌ దుకాణాన్ని తనిఖీ చేశారు. స్ర్పే మందులు, ధరలు, స్టాకు రిజిస్టర్‌, రసీదు పుస్తకాలు, తదితర వివరాలను పరిశీలించారు. యూరియా కొరత లేకుండా చూడాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. ఆయా కార్యక్రమంలో కాగజ్‌నగర్‌ తహసీల్దార్‌ మధుకర్‌, ఏడీఏ మనోహర్‌, ఆసుపత్రి సూపరింటెండెంట్‌ కేశవరావు, ఎంఈఒ వాసాల ప్రభాకర్‌, వైద్యులు, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Jul 26 , 2025 | 11:14 PM