రోగులకు మెరుగైన సేవలందించాలి
ABN , Publish Date - Aug 20 , 2025 | 11:22 PM
ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు మెరుగైన వైద్య సేవలందిం చాలని ఆసుపత్రి పరిసరాలను శు భ్రంగా ఉంచాలని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు.
- ఆసుపత్రి పరిసరాలను శుభ్రంగా ఉంచాలి : కలెక్టర్
నాగర్‌కర్నూల్, ఆగస్టు 20 (ఆంధ్రజ్యోతి) : ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు మెరుగైన వైద్య సేవలందిం చాలని ఆసుపత్రి పరిసరాలను శు భ్రంగా ఉంచాలని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. బుధవారం నాగర్ కర్నూల్ జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసు పత్రిని సందర్శించి, ఐసీయూలో రోగు లకు అందించే చికిత్సను కలెక్టర్ పరిశీలించారు. కలెక్టర్ ఆసుపత్రి అన్ని విభాగాలను పరిశీలించి వైద్యులతో మాట్లాడారు. ఆసుపత్రిలో సమస్య లుంటే తన దృష్టికి తీసుకురావాలని కలెక్టర్ వై ద్యులకు సూచించారు. ఆసుపత్రిలో రోగులతో ప్రత్యక్షంగా మాట్లాడుతూ వారు పొందుతున్న వైద్య సేవల వివరాలను అడిగి తెలుసుకున్నా రు. సీజనల్ వ్యాధుల కారణంగా రోగులకు ఇబ్బంది కలగకుండా మెరుగైన వైద్య సేవలం దించాలని సిబ్బందిని ఆదేశించారు. కలుషిత నీరు, ఆహారం, అపరిశుభ్రత, దోమలు, ఈగలు, కీటకాలు, పందులు తదితర జంతువుల ద్వారా సీజనల్ వ్యాధులపై రోగులకు అవగాహన క ల్పించాలని అన్నారు. కలెక్టర్ వెంట జిల్లా ఆసు పత్రి ఆర్‌ఎంవో డాక్టర్ అజీమ్, డాక్టర్ రోహిత్, డాక్టర్ ప్రమోద్, ఇతర వైద్యులు ఉన్నారు.