Share News

ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి

ABN , Publish Date - Sep 23 , 2025 | 11:25 PM

లక్షెట్టిపేట ఆసుపత్రికి వైద్యం కోసం వచ్చే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ వైద్య సిబ్బందికి సూచించారు. పట్టణంలోని 30పడకల ఆసుపత్రిని కలెక్టర్‌ స్థానిక తహసీల్దార్‌తో కలిసి మంగళవారం పరిశీలించారు. ఈసందర్భంగా కలెక్టర్‌ మా ట్లాడుతూ ప్రభుత్వం వైద్య రంగంను బలోపేతం చేస్తు ప్రజా సంక్షేమమే దిశగా చర్యలు చేపడుతోందన్నారు.

ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి
కస్తూర్బా గాంధీ పాఠశాలను పరిశీలిస్తున్న కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌

కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌

లక్షెట్టిపేట, సెప్టెంబరు23 (ఆంధ్రజ్యోతి): లక్షెట్టిపేట ఆసుపత్రికి వైద్యం కోసం వచ్చే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ వైద్య సిబ్బందికి సూచించారు. పట్టణంలోని 30పడకల ఆసుపత్రిని కలెక్టర్‌ స్థానిక తహసీల్దార్‌తో కలిసి మంగళవారం పరిశీలించారు. ఈసందర్భంగా కలెక్టర్‌ మా ట్లాడుతూ ప్రభుత్వం వైద్య రంగంను బలోపేతం చేస్తు ప్రజా సంక్షేమమే దిశగా చర్యలు చేపడుతోందన్నారు. ప్రజల సౌకర్యార్థం అవసరమైన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు ఏర్పాటు చేయడంతో పాటు అన్ని ప్ర భుత్వ ఆసుపత్రుల్లో అవసరమైన మేరకు వైద్యులను, సిబ్బందిని, మందులను కూడా అందుబాటులో ఉంచా మన్నారు. సీజనల్‌ వ్యాధుల పట్ల తీసుకునే జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. అదే విధంగా ఆసుపత్రిలోని పలు రికార్డులతో పాటు ల్యాబ్‌, ఫార్మసీ, వార్డులను పరిశీలించారు. మార్చురి, క్యాంటిన్‌ నిర్మా ణం పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. అదే విధంగా పట్టణంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల గదుల నిర్మాణం పనులు పరిశీలించారు. పాఠశాల పునఃప్రారంభం వరకు పనులు జరిగే విధంగా చూడాలని నిర్వాహకులను ఆదేశించారు. మున్సిపాలిటీలోని పలు వార్డుల్లో తిరుగుతూ పారిశుధ్య పనులను పరిశీలించారు. అమృత్‌2.0 పథకంలో నీటి ట్యాంకుల ద్వారా ప్రజలక నిరంతరం తాగునీరు అందించేందుకు చర్యలు తీసుకోవాలని మున్సిపల్‌ కమిషనర్‌ను ఆదేశించారు. ఈకార్యక్రమంలో డీసీహెచ్‌ఎస్‌ డాక్టర్‌ కోటేశ్వర్‌, ప్రభుత్వ ఆసుపత్రి సూపరిండెంట్‌ డాక్టర్‌ ఆకుల శ్రీనివాస్‌, మున్సిపల్‌ కమషనర్‌ విజయ్‌కుమార్‌, ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు స్రవంతి, సురేష్‌, కృష్ణ ఉన్నారు.

Updated Date - Sep 23 , 2025 | 11:25 PM