Share News

ఎంపీని అవమానించినందుకు నిరసన

ABN , Publish Date - May 24 , 2025 | 10:29 PM

సరస్వతి పుష్కరాలకు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణను ఆహ్వానించకుండా, ఎక్కడా ఫోటో పెట్టకుండా అవమా నించడాన్ని నిరసిస్తూ ఆలిండియా అంబేద్కర్‌ సంఘం నాయకులు శనివా రం పట్టణంలోని అంబేద్కర్‌ విగ్రహం వద్ద ప్లకార్డులతో నిరసన తెలిపారు.

ఎంపీని అవమానించినందుకు నిరసన
నిరసన తెలుపుతున్న ఆలిండియా అంబేద్కర్‌ సంఘం నాయకులు

చెన్నూరు, మే 24 (ఆంధ్రజ్యోతి) : సరస్వతి పుష్కరాలకు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణను ఆహ్వానించకుండా, ఎక్కడా ఫోటో పెట్టకుండా అవమా నించడాన్ని నిరసిస్తూ ఆలిండియా అంబేద్కర్‌ సంఘం నాయకులు శనివా రం పట్టణంలోని అంబేద్కర్‌ విగ్రహం వద్ద ప్లకార్డులతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ దళిత ఎంపీ అయిన వంశీకృష్ణ ఫోటో పెట్టకుండా, ఆయనను ఆహ్వానించకుండా స్ధానిక ఎమ్మెల్యే శ్రీధర్‌బా బు అవమానించారన్నారు. వెంటనే ఎమ్మెల్యేపై అధిష్టానం తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రోటోకాల్‌ పాటించని దేవాదాయ శాఖ చీఫ్‌ సెక్రటరీని సస్పెండ్‌ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా నాయకులు ఆసంపల్లి శ్రీనివాస్‌, వెంకటి, జనగామ తిరుపతి, లింగంపల్లి మహేష్‌, దుర్గం వెంకటి, దాసరి కమలాకర్‌ పాల్గొన్నారు.

Updated Date - May 24 , 2025 | 10:29 PM