Share News

బీఆర్‌ఎస్‌ నాయకుల నిరసన

ABN , Publish Date - Mar 14 , 2025 | 11:39 PM

అసెంబ్లీ నుంచి మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్‌రెడ్డిని సస్పెండ్‌ చే యడాన్ని నిరసిస్తూ బీఆర్‌ఎస్‌ నాయకులు శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తాలో నిరసన కార్యక్ర మం చేపట్టారు.

బీఆర్‌ఎస్‌ నాయకుల నిరసన

గర్మిళ్ల, మార్చి 14 (ఆంధ్రజ్యోతి) : అసెంబ్లీ నుంచి మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్‌రెడ్డిని సస్పెండ్‌ చే యడాన్ని నిరసిస్తూ బీఆర్‌ఎస్‌ నాయకులు శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తాలో నిరసన కార్యక్ర మం చేపట్టారు.

నాయకులు మాట్లాడుతూ ప్రశ్నించే గొంతుకలను నొక్కే ప్రయత్నం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం చేస్తుందని, దీన్ని ప్రజలందరు గమనిస్తున్నానన్నారు. ఈ కార్యక్ర మంలో పట్టణాధ్యక్షుడు గాదె సత్యం, నాయకులు గో గుల రవీందర్‌, ఎర్రం తిరుపతి, పడాల రవీందర్‌, శం కర్‌, గట్టయ్య, రుపతి, రవీందర్‌, ప్రశాంత్‌, భాను చందర్‌, అమృత్‌రాజ్‌, కార్యకర్తలు పాల్గొన్నారు.

భీమారం : కాంగ్రెస్‌ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూ పిన సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్‌రెడ్డిని అసెంబ్లీ నుంచి సస్పెండ్‌ చేయడాన్ని నిరసిస్తూ బీఆర్‌ఎస్‌ నాయకులు శుక్రవారం భీమారం మండల కేంద్రంలో కాంగ్రెస్‌ ప్రభు త్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు కలగూర రాజ్‌కుమార్‌, నాయకులు రాము, కళావతి పాల్గొన్నారు.

లక్షెట్టిపేట: పట్టణంలోని ఊత్కూర్‌ చౌరస్తాలో బీఆర్‌ఎస్‌ నాయకులు శుక్రవారం రాస్తారోకో చేపట్టా రు. ఈసందర్భంగా పార్టీ నాయకులు మాట్లాడుతూ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే జగదీశ్వర్‌ రెడ్డిని అసెంబ్లీ నుండి సస్పెండ్‌ చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్‌ పార్టీ నాయకులు ప్రశ్నించే గొంతులను మూసేయ డం సరికాదన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేస్తే ఎ వరూ ప్రశ్నించరని ఎమ్మెల్యే సస్పెండ్‌ను తక్షణమే ఉ పసంహరించుకోవాలని డిమాండ్‌ చేసారు. పోలీసు లు నాయకులు చేస్తున్న నిరసనను బగ్నం చేసారు. అనంతరం బీఆర్‌ఎస్‌ నాయకులు పట్టణ పోలీస్‌ స్టే షన్‌లో ఎస్సై-2 రామయ్యకు వినతిపత్రం అందజేశా రు. డీసీఎమ్మెస్‌ చైర్మన్‌ తిప్పని లింగన్న, బీఆర్‌ఎస్‌ పార్టీ పట్టణ అద్యక్షుడు శ్రీనివాస్‌, మండల అధ్యక్షు డు చిన్నయ్య, మున్సిపల్‌ మాజీ వైస్‌ చైర్మన్‌శ్రీని వా స్‌ గౌడ్‌, మాజీ కౌన్సిలర్లు రాజన్న, శ్రీకాంత్‌, నాయ కులు సురేష్‌, చాంద్‌, ఇంతియాజ్‌ ఉన్నారు.

Updated Date - Mar 14 , 2025 | 11:39 PM