Protest Against Plot to Remove Lambadis: లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించే కుట్ర
ABN , Publish Date - Sep 20 , 2025 | 05:03 AM
రాజకీయ ప్రయోజనాల కోసం లంబాడీలపై కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తూ చారిత్రక వాస్తవాలను వక్రీకరించి గిరిజన సమాజాన్ని...
ఇందిరాపార్కు వద్ద లంబాడీల ఆత్మగౌరవ సభలో వక్తలు
కవాడిగూడ, సెప్టెంబరు 19 (ఆంఆంధ్రజ్యోతి): రాజకీయ ప్రయోజనాల కోసం లంబాడీలపై కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తూ చారిత్రక వాస్తవాలను వక్రీకరించి గిరిజన సమాజాన్ని విభజించడానికి ప్రయత్నిస్తున్నారని, అలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని పలువురు వక్తలు పేర్కొన్నారు. శుక్రవారం ఇందిరా పార్కు వద్ద తెలంగాణ లంబాడీల ఐక్యవేదిక ఆధ్వర్యంలో లంబాడీల ఆత్మగౌరవ సభను నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా రిటైర్డ్ అడిషనల్ డీజీపీ డీటీ నాయక్, మాజీ మంత్రులు సత్యవతి రాథోడ్, రెడ్యానాయక్, అమర్‌సింగ్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని కొందరు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. రాజ్యాంగబద్ధంగా పార్లమెంట్ చట్టం ద్వారా లంబాడీలను ఎస్టీ జాబితాలో చేర్చారని వారు గుర్తు చేశారు. హైదరాబాద్ సంస్థానంలో కూడా లంబాడీలు ఇతర గిరిజన తెగలైన గోండు, కోయ, చెంచులతో పాటు గిరిజన జాబితాలో ఉన్నారని, ఇందుకు ఆధారాలు ఉన్నాయని చెప్పారు.