చట్టాలపై అవగాహనతోనే హక్కుల రక్షణ
ABN , Publish Date - Dec 19 , 2025 | 11:02 PM
గ్రామీణ ప్రాంతాల లో చట్టాలపై కనీస అవగాహన క లిగి ఉండాలని అచ్చంపేట జూని యర్ సివిల్ న్యాయాధికారి స్పంద న అన్నారు.
- అచ్చంపేట జూనియర్ సివిల్ న్యాయాధికారి స్పందన
అచ్చంపేటటౌన్, డిసెంబరు 19 (ఆంధ్రజ్యోతి) : గ్రామీణ ప్రాంతాల లో చట్టాలపై కనీస అవగాహన క లిగి ఉండాలని అచ్చంపేట జూని యర్ సివిల్ న్యాయాధికారి స్పంద న అన్నారు. శుక్రవారం మండల ప రిధిలోని పల్కపల్లి గ్రామంలో మం డల న్యాయ సేవాఽధికార సంస్థ ఆధ్వ ర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆమె పాల్గొని మాట్లాడారు. చట్టాలపై అవగాహన కలిగి ఉంటే తమహక్కులను కాపాడుకోగలుతారని అ న్నారు. బాల్య వివాహాల నివారణ, సైబర్ నేరా లు, భూతగాదాలు, మత్తుపదార్థాల వల్ల కలిగే అనర్థాలను వివరించారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సంతోష్‌రెడ్డి, అచ్చంపేట బార్ అసోసి యేషన్ అధ్యక్షుడు మస్తాన్, ఎస్‌ఐ సద్దాంహు స్సేన్, న్యాయవాదులు వెంకట్‌శెట్టి, శ్రీధర్‌రావు, వెంకటరమణ, రవికుమార్ పాల్గొన్నారు.