Share News

మూత్రపిండాలను కాపాడుకోవాలి

ABN , Publish Date - Mar 13 , 2025 | 10:44 PM

ప్ర పంచ కిడ్నీ దినోత్సవం సందర్భంగా నాగర్‌క ర్నూల్‌ ప్రభుత్వ ఆసుపత్రిలో సూప రింటెండెం ట్‌ డాక్టర్‌ రఘు ఆధ్వర్యంలో (డయా లసిస్‌ సెంటర్‌లో) కేక్‌ కట్‌ చేసి కార్యక్రమం నిర్వహిం చారు.

మూత్రపిండాలను కాపాడుకోవాలి
ప్రపంచ కిడ్నీ దినోత్సవం సందర్భంగా కేక్‌ కట్‌ చేస్తున్న సూపరింటెండెంట్‌ రఘు, సిబ్బంది

- ఆసుపత్రిలో ప్రపంచ కిడ్నీ దినోత్సవం

కందనూలు, మార్చి 13 (ఆంధ్రజ్యోతి) : ప్ర పంచ కిడ్నీ దినోత్సవం సందర్భంగా నాగర్‌క ర్నూల్‌ ప్రభుత్వ ఆసుపత్రిలో సూప రింటెండెం ట్‌ డాక్టర్‌ రఘు ఆధ్వర్యంలో (డయా లసిస్‌ సెంటర్‌లో) కేక్‌ కట్‌ చేసి కార్యక్రమం నిర్వహిం చారు. ఈ సందర్భంగా డాక్టర్‌ రఘు కిడ్నీ, మని షి శరీరంలో నిర్వహించే పని తీరు గురించి వివరిస్తూ మూత్ర పిండాల ఆరోగ్యాన్ని కాపాడు కోవడంపై ప్రజల్లో అవగాహన అవసరమని తెలిపారు. మధుమేహం, రక్తపోటు ఉన్న వారు క్రమం తప్పక మాత్రలు వాడుతూ బీపీ అదుపు లో ఉంచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్‌ ఆర్‌ఎంవోలు డాక్టర్‌ రవిశంకర్‌, డాక్టర్‌ అజిమ్‌, డాక్టర్‌ ప్రశాంత్‌, నర్సింగ్‌ సూపరింటెండెంట్‌ స ద్గుణ, హెచ్‌వోడీలు హాస్పిటల్‌ నర్సింగ్‌ సిబ్బంది పాల్గొన్నారు.

అప్రమత్తంగా ఉండాలి

కల్వకుర్తి : కిడ్నీ వ్యాధుల ప్రజలు అప్రమత్తంగా ఉండా లని కల్వకుర్తి ప్రభుత్వ ఆసుప త్రి సూపరిం టెండెంట్‌ డాక్టర్‌ శివరాం కోరారు. కల్వకుర్తి పట్టణంలోని ప్రభు త్వ ఆసుపత్రిలోని డయాలసిస్‌ సెంటర్‌లో ప్రపంచ కిడ్నీ దినోత్సవాన్ని గురువారం జరు పుకున్నారు. ధూమపానం, మద్యపానానికి బాని స కాకూడదని, శరీరానికి కావాల్సినంత నీటిని తీసుకోవాలని లేకపోతే డీహైడ్రేషన్‌ అయి కిడ్నీలపై ప్రభావం పడుతుందని అన్నారు.

Updated Date - Mar 13 , 2025 | 10:44 PM