Share News

పాఠశాలల్లో మౌలిక సదుపాయాలకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలి

ABN , Publish Date - May 17 , 2025 | 10:57 PM

జిల్లాలో నూతనంగా నిర్మి స్తున్న ప్రభుత్వ ఉన్నత పాఠశాల, జూనియర్‌ కళాశాలలో మౌలిక సదు పాయాలు సమకూర్చేందుకు అవసరాలకు అనుగుణంగా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ పేర్కొన్నారు.

పాఠశాలల్లో మౌలిక సదుపాయాలకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలి
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌

కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌

మంచిర్యాల కలెక్టరేట్‌, మే17(ఆంధ్రజ్యోతి): జిల్లాలో నూతనంగా నిర్మి స్తున్న ప్రభుత్వ ఉన్నత పాఠశాల, జూనియర్‌ కళాశాలలో మౌలిక సదు పాయాలు సమకూర్చేందుకు అవసరాలకు అనుగుణంగా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ పేర్కొన్నారు. కలెక్టర్‌ సమావేశ మందిరంలో మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్‌రావుతో కలిసి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మా ట్లాడుతూ విద్యా వ్యస్థను మరింతగా బలోపేతం చేస్తూ లక్షెట్టిపేట మం డల కేంద్రంలో నూతనంగా నిర్మిస్తున్న ప్రభుత్వ ఉన్నత పాఠశాల జూని యర్‌ కళాశాలలో విద్యార్థులకు అవసరమైన మేరకు సదుపాయాలు కల్పిం చేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. కళాశాలల్లో విద్యార్థులకు అవసరమైన మేరకు సదుపాయాలు కల్పించేందుకు అధికార యంత్రాంగం సిద్ధంగా ఉందన్నారు. విద్యార్థులకు సకల సదుపాయాలతో కూడిన నాణ్య మైన విద్యను అందించేందుకు ప్రభుత్వ నూతన భవన నిర్మాణాలు చేపట్టి అందులో ఫర్నీచర్‌, ల్యాబ్‌ పరికరాలు, బోధన సామగ్రి కల్పించేందుకు చ ర్యలు తీసుకుంటున్నామన్నారు. ఉపాధ్యాయులు, అధ్యాపకులు చిత్తశుద్ధితో పని చేయాలని విద్యార్థులకు గుణాత్మక విద్యను అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇంటర్‌మీడియట్‌, జిల్లా విద్యాశాఖ అధికారులు, ఫర్నీ చర్‌ సంబంధిత సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

Updated Date - May 17 , 2025 | 10:57 PM