kumaram bheem asifabad- ప్రతిపాదనలు సిద్ధం చేయాలి
ABN , Publish Date - Jul 01 , 2025 | 11:07 PM
మల్టీ పర్పస్ సెంటర్లలో అన్ని విధాల సదుపాయాలు కల్పించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అదనపు కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. వాంకిడి మండలం ఖిరిడి గ్రామ పంచాయతీలోని లింబుగూడలో మంగళవారం ఆయన పర్యటించారు. పీఎం జన్‌మన్ పథకంలో భాగంగా నిర్మించిన మల్టీపర్పస్ సెంటర్లలో అంగన్‌వాడీ, హెల్త్ ఆఫీస్‌లకు కావాల్సిన అన్ని రకాల వసతులు ఏర్పాటు చేయుటకు కావాల్సిన ప్రతిపాదనలు తయారు చేసి పంపాలని ఐటీడీఏ ఏఈని ఆదేశించారు.
వాంకిడి, జూలై 1 (ఆంధ్రజ్యోతి): మల్టీ పర్పస్ సెంటర్లలో అన్ని విధాల సదుపాయాలు కల్పించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అదనపు కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. వాంకిడి మండలం ఖిరిడి గ్రామ పంచాయతీలోని లింబుగూడలో మంగళవారం ఆయన పర్యటించారు. పీఎం జన్‌మన్ పథకంలో భాగంగా నిర్మించిన మల్టీపర్పస్ సెంటర్లలో అంగన్‌వాడీ, హెల్త్ ఆఫీస్‌లకు కావాల్సిన అన్ని రకాల వసతులు ఏర్పాటు చేయుటకు కావాల్సిన ప్రతిపాదనలు తయారు చేసి పంపాలని ఐటీడీఏ ఏఈని ఆదేశించారు. అనంతరంసెంటర్ ఆవరణలో మొక్కలు నాటారు. త్వరలో మల్టీ పర్పస్ సెంటర్ ప్రారం భోత్సవం చేసేందుకు చర్యలుత తీసుకంటామన్నారు. అనంతరం గ్రామ పంచాయతీలో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించారు. ఆయన వెంట డీటీడబ్ల్యూవో రమాదేవి, ఎంపీడీవో ప్రవీణ్‌కుమార్, ఎంపీవో ఖాజా అజీజోద్దీన్, ఏపీరవో శ్రావణ్‌కుమార్, ఈసీ మోసిన్, ఏఈ నజీముద్దీన్, కార్యదర్శి, తదితరులు పాల్గొన్నారు.