ఎన్నికల సిబ్బందికి సరైన వసతులు కల్పించాలి
ABN , Publish Date - Dec 07 , 2025 | 11:24 PM
జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల విధుల్లో పాల్గొననున్న సిబ్బందికి సరైన వసతులు కల్పించాలని టీఎస్‌యూటీ ఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఆర్.కృష్ణ, ప్రధాన కార్య దర్శి ఎం.శ్రీధర్‌శర్మ ఆదివారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.
- టీఎస్‌యూటీఎఫ్ డిమాండ్
నాగర్‌కర్నూల్ టౌన్, డిసెంబరు 7 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల విధుల్లో పాల్గొననున్న సిబ్బందికి సరైన వసతులు కల్పించాలని టీఎస్‌యూటీ ఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఆర్.కృష్ణ, ప్రధాన కార్య దర్శి ఎం.శ్రీధర్‌శర్మ ఆదివారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ఉపాధ్యా యులు, ఉద్యోగులకు నిర్వహించిన శిక్షణలో సరైన వసతులు లేక తీవ్ర ఇబ్బందులు పడ్డారని పేర్కొన్నారు. వంగూరు, కల్వకుర్తి, వెల్దండ మండలాల్లో ఎన్నికల శిక్షణకు వెళ్లిన సిబ్బందికి సరైన కుర్చీలు లేక చాలా మంది నిలబడే శిక్షణలో పాల్గొన్నారన్నారు. శిక్షణలో మధ్యాహ్న భోజన సమయపాలన కూడా సక్రమంగా పాటించకపోవడంతో బీపీ, షుగర్ ఉన్న ఉద్యోగులు తీవ్ర అవస్థలు పడ్డారన్నా రు. జరగబోయే రెండో, మూడో విడత శిక్షణ లో పాల్గొన సిబ్బందికి మెరుగైన మౌలిక స దుపాయాలు కల్పించాలని వారు కోరారు.