CulturalEvent: సామూహిక చైతన్య సాధనాలే కళలు, సాహిత్యం
ABN , Publish Date - Oct 14 , 2025 | 03:10 AM
సమాజంలో ప్రజాస్వామిక వాతావరణాన్ని పెంపొందించడానికి సాహిత్యం, కళలు ఎంతగానో తోడ్పడతాయని తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్...
తెలంగాణ హైకోర్టు జస్టిస్ సూరేపల్లి నంద వ్యాఖ్య
సుద్దాల జానకమ్మ హనుమంతు పురస్కారాల ప్రదానోత్సవం
హైదరాబాద్ సిటీ, అక్టోబరు 13(ఆంధ్రజ్యోతి): సమాజంలో ప్రజాస్వామిక వాతావరణాన్ని పెంపొందించడానికి సాహిత్యం, కళలు ఎంతగానో తోడ్పడతాయని తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సూరేపల్లి నంద చెప్పారు. సాహిత్యం, కళలు సామూహిక చైతన్య సాధనాలుగా సమాజంలో సానుకూల దృక్పథాన్ని పెంపొందించడానికి ముఖ్య భూమికగా నిలుస్తాయన్నారు. బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన సుద్దాల జానకమ్మ హనుమంతు సాహితీ-జానపద-నృత్య పురస్కారాల ప్రదానోత్సవంలో జస్టిస్ సూరేపల్లి నంద పాల్గొని ప్రసంగించారు. స్త్రీవాద రచయిత్రి ఓల్గాకు సుద్దాల జానకమ్మ సాహితీ పురస్కారాన్ని, గాయని మధుప్రియకు సుద్దాల హనుమంతు జానపద అవార్డును, కూచిపూడి నర్తకి లాలీనిధికి నృత్య పురస్కారం అందజేశారు. ఈ ఏడాది నుంచి తన మాతృమూర్తి సుద్దాల జానకమ్మ స్మారకంగా సాహితీ పురస్కారాన్ని ప్రారంభించినట్లు సుద్దాల ఫౌండేషన్ నిర్వాహకుడు సుద్దాల అశోక్ తేజ తెలిపారు. కార్యక్రమంలో భాగంగా మధుప్రియ పాటలు, లాలీ నిధి నృత్య ప్రదర్శన ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.