Share News

ఎత్తిపోస్తున్న ప్రాజెక్టులు

ABN , Publish Date - Aug 12 , 2025 | 01:01 AM

నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు 4 క్రస్ట్‌ గేట్ల నుంచి దిగువకు నీటి విడుదల కొనసాగుతోంది. ఆదివారం సాయంత్రం 8 గేట్ల ద్వారా నీటిని విడుదల చేసిన అధికారులు సాగర్‌ నీటిమట్టం అర అడుగు తగ్గడంతో సోమవారం ఉదయం 10 గంటల కు రెండు గేట్లను మూసివేసి ఆరు గేట్ల ద్వారా, తర్వాత మఽధ్యాహ్నం మరో రెండు గేట్లను మూసివేసి 4 గేట్ల ద్వారా నీటిని విడుదల చేస్తున్నారు.

  ఎత్తిపోస్తున్న ప్రాజెక్టులు
నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు నాలుగు క్రస్ట్‌ గేట్ల నుంచి దిగువకు వెళ్తున్న నీరు

ఎత్తిపోస్తున్న ప్రాజెక్టులు

4 క్రస్టు గేట్ల నుంచి సాగర్‌ నీటి విడుదల

589.30 అడుగులకు చేరుకున్న నీటి మట్టం

మూసీలో మూడు క్రస్టుగేట్ల ఎత్తివేత

నాగార్జునసాగర్‌, ఆగస్టు 11(ఆంధ్రజ్యోతి): నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు 4 క్రస్ట్‌ గేట్ల నుంచి దిగువకు నీటి విడుదల కొనసాగుతోంది. ఆదివారం సాయంత్రం 8 గేట్ల ద్వారా నీటిని విడుదల చేసిన అధికారులు సాగర్‌ నీటిమట్టం అర అడుగు తగ్గడంతో సోమవారం ఉదయం 10 గంటల కు రెండు గేట్లను మూసివేసి ఆరు గేట్ల ద్వారా, తర్వాత మఽధ్యాహ్నం మరో రెండు గేట్లను మూసివేసి 4 గేట్ల ద్వారా నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు(312.0450టీఎంసీలు)కాగా సోమవారం సాయంత్రానికి 589.30అడుగులుగా (309. 9534 టీఎంసీలు) ఉంది. సాగర్‌ నుంచి కుడి కాలువ ద్వారా 7,086 క్యూసెక్కులు, ఎడమ కాల్వ ద్వారా 6,173 క్యూసెక్కులు, ఎస్‌ఎల్‌బీసీ ద్వారా 1,800 క్యూసెక్కులు, వరద కాల్వ ద్వారా 300 క్యూసెక్కులు, ప్రధాన జలవిద్యుత కేంద్రం ద్వారా 28,542 క్యూసెక్కులు, నాలుగు క్రస్ట్‌ గేట్లను ఐదు అడుగుల మేర ఎత్తి 32,108 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. సాగర్‌ నుంచి మొత్తం 76,009 క్యూసెక్కుల నీరు విడుదల అవుతుండ గా ఎగువనుంచి 65,800 క్యూసెక్కుల నీరు సాగర్‌కు వచ్చి చేరుతోంది.

మూసీకి నిలకడగా ఇన్‌ఫ్లో

కేతేపల్లి: మూసీ ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో నిలకడగా కొనసాగుతోంది. ఎ గువ మూసీ పరివాహక ప్రాంతాలతో పాటు రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ నగరంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు ఈ నె ల 5 నుంచి మూసీ నదికి వరద ఉధృతి కొనసాగుతుంది. దీంతో మూ సీ డ్యాం అధికారులు అప్రమత్తంగా ఉంటూ ఎగువ నుంచి వచ్చే ఇన్‌ఫ్లోకు అనుగుణంగా ప్రాజెక్టు క్రస్టు గేట్ల నిర్వహణను పర్యవేక్షిస్తున్నా రు. ప్రాజెక్టు నీటిమట్టం 643 అడుగుల గరిష్ఠ స్థాయిలో ఉండేలా చూ స్తూ అదనపు నీటిని ప్రాజెక్టు క్రస్టుగేట్లను ఎత్తి దిగువ మూసీకి విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం సాయంత్రం 4719.16 క్యూసెక్కులుగా ఇన్‌ఫ్లో నమోదైంది. ఇన్‌ఫ్లోకు అనుగుణంగా ప్రాజెక్టు 2, 3, 10 నెంబరు క్రస్టుగేట్లను 2 అడుగుల మేర ఎత్తి 3860.58 క్యూసెక్కుల వరదను దిగువకు విడుదల చేస్తున్నారు. ఇదిలా ఉంటే 645 అ డుగులు(4.46టీఎంసీలు) పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం గల మూ సీ ప్రాజెక్టు ప్రస్తుత నీటిమట్టం 643.38అడుగులు (4.04టీఎంసీలు)గా ఉంది. ప్రాజెక్టు కుడి, ఎడమ కాల్వల ద్వారా ఆయకట్టుకు 454.86 క్యూ సెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.

వారం రోజుల క్రితం వెలవెల.. నేడు కళకళ

మఠంపల్లి: ప్రకృతి సహకరిస్తే ఏదైనా జరగుతుంది... వారం రోజుల క్రితం మట్టపల్లి వద్ద కృష్ణానది వెలవెలబోయి కనిపించింది. కానీ నేడు కళకళలాడుతూ... గలగల పారుతూ కృష్ణమ్మ పరుగు తీస్తోంది. పది రోజుల క్రితం వరకు సాగర్‌కు నీరందుతుందా..? లేదా వ్యవసాయం సాగవుతుందా లేదా అని ఆయకట్టు రైతులు ఆందోళన చెందారు. కృష్ణా బేసినలో సమృద్ధిగా వర్షాలు కురవడంతో ప్రాజెక్టులన్నీ నిండి ఆ వరద సాగర్‌ ప్రాజెక్టుకు రావడంతో రైతులు సంతో షం వ్యక్తం చేస్తున్నారు. సాగర్‌ ప్రాజెక్టు నిండి కుడి, ఎడమకాల్వలకు నీ టిని విడుదల చేయడం, ఆ వెంటనే ప్రాజెక్టు ద్వారా 24 గేట్లను ఎత్తి 4లక్షల 35వేల క్యూసెక్కుల నీటిని పులిచింతల ప్రాజెక్టు వైపునకు వ దులుతున్నారు. దీంతో మట్టపల్లి వద్ద కృష్ణానది కళకళలాడుతూ ప్ర వహిస్తోంది. ఉధృతి ఇలానే కొనసాగితే ఎల్‌ఆర్‌ఎల్‌ లెవల్‌ దాటే పరిస్థితి నెలకొంది. నీటి రాకతో భూగర్భజలాలు పెరిగి బోర్లు, బావుల్లో నీరు సమృద్ధిగా ఉంటుందని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నిన్నటి వరకు గ్రామాల్లో సైతం ఇళ్లలో బోర్లు ఎండిపోయిన దుస్థితి నెలకొంది. ప్రకృతి కరుణించి కృష్ణానది పొంగిపొర్లుతుండటంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Aug 12 , 2025 | 01:01 AM