రాజ్యాధికారంతో బీసీలకు ప్రగతి
ABN , Publish Date - Jun 22 , 2025 | 11:42 PM
రాజ్యాధికారంతోనే బీసీ లకు అభివృద్ధిబాట వైపు ప్రగతి సాధిస్తారని ఐఎఎస్ అధికారి, ఆలయ ఫౌండేషన్ చైర్మన్ పరికిపండ్ల నరహరి అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రం లో నిర్వహించిన ఓబీసీల పోరుబాట పుస్తకాన్ని ఆవిష్కరించారు.
ఐఎఎస్ అధికారి పరికిపండ్ల నరహరి
మంచిర్యాలకలెక్టరేట్, జూన్22 (ఆంధ్రజ్యోతి): రాజ్యాధికారంతోనే బీసీ లకు అభివృద్ధిబాట వైపు ప్రగతి సాధిస్తారని ఐఎఎస్ అధికారి, ఆలయ ఫౌండేషన్ చైర్మన్ పరికిపండ్ల నరహరి అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రం లో నిర్వహించిన ఓబీసీల పోరుబాట పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈసం దర్భంగా ఓబీసీల పోరబాట తెలంగాణ బీసీ సంఘం రాష్ట్ర నాయకుడు నీలి శ్రీనివాస్ ఆధ్వర్యంలో తీసుకొచ్చిన ఓబీసీల పోరుబాట పుస్తకాన్ని ఆ విష్కరించారు. అడుక్కుంటే వచ్చేది కాయో, పండుకాని పోరాడితే మా త్రం వచ్చేది హక్కులేనన్నారు. అణచివేతకు గురైనవారు మాత్రమే హ క్కులు కోరుతారన్నారు. సంఘాలు ఏర్పాటు చేసుకుంటారు, వారే పుస్తకా లు రాస్తారన్నారు. ఉద్యమాలు చేస్తారన్నారు. రాజ్యాంగం ఎవరి చేతిలో ఉందనే దానిమీద ఆధారపడే రేపటి ఫలితాలు ఉంటాయన్నారు. ఈకా ర్యక్రమంలో కందుల సంధ్యారాణి, కెంగర్ల మల్లయ్య, హరిక్రిష్ణ, ముకేశ్ గౌడ్ పాల్గొన్నారు.