kumaram bheem asifabad- లాభాల పూ‘బంతి’
ABN , Publish Date - Sep 28 , 2025 | 11:00 PM
మండ లంలోని రైతులు బంతి పూలు సాగు చేస్తూ లాభా లు అర్జిస్తున్నారు. వాణిజ్య పంటలు సాగు చేసి...పెట్టిన పెట్టుబడులు రాక రైతులు నష్టాలను చవిచూస్తుంటారు. కానీ కొందరు రైతులు వినూత్న నంగా ఆలోచిస్తున్నారు. ప్రజల అవసరాలను గుర్తిస్తూ కాలానుగుణ పంటల సాగుతో ముందుకు సాగుతున్నారు.
- బతుకమ్మ సీజన్‌లో ఆదాయం అర్జిస్తున్న రైతులు
బెజ్జూరు, సెప్టెంబరు 28 (ఆంధ్రజ్యోతి): మండ లంలోని రైతులు బంతి పూలు సాగు చేస్తూ లాభా లు అర్జిస్తున్నారు. వాణిజ్య పంటలు సాగు చేసి...పెట్టిన పెట్టుబడులు రాక రైతులు నష్టాలను చవిచూస్తుంటారు. కానీ కొందరు రైతులు వినూత్న నంగా ఆలోచిస్తున్నారు. ప్రజల అవసరాలను గుర్తిస్తూ కాలానుగుణ పంటల సాగుతో ముందుకు సాగుతున్నారు. ప్రధానంగా బెజ్జూరు మండలంలోని ఎల్కపల్లి, హేటిగూడ గ్రామాల్లో రైతులు పూలసా గు బాటపట్టి సత్ఫలితాలతో తోటి రైతులకు స్ఫూర్తి గా నిలుస్తున్నారు. బతుకమ్మ, దేవీ శరన్నవరాత్రు లు, దసరా సందర్భంగా అవసరమైన వారికి బంతి పూలు విక్రయిస్తూ లాభాలు గడిస్తున్నారు.
- మూడు నెలల్లోనే..
బెజ్జూరు మండలంలోని ఎల్కపల్లి, హేటిగూడ గ్రామాల్లో కొట్రంగి వెంకటి, వడాయి పోశన్న అనే రైతులు బంతిపూల సాగు చేపట్టారు. దసరా పండుగకు మూడు నెలల ముందుగానే రైతులు తమకున్న కొద్దిపాటి భూమిలో బంతిసాగు ఆరం భించి పండుగ సమయానికి కల్లా పూల దిగుబడి వచ్చేలా ముందుచూపుతో తోటలు వేశారు. ప్రస్తు తం పల్లెలు, పట్టణాల్లో సంప్రదాయ బతుకమ్మలా టలకు అవసరమైన పూలు సమీపంలోనే అందు బాటులో ఉండటంతో ఇటు సాగుదారులకు, అటు కొనుగోలు దారులకు లాభదాయకంగా మారింది. మూడు నెలల వ్యవదిలో పంట చేతికొచ్చే బంతిని హేటిగూడలో ఒక ఎకరం, ఎల్కపల్లిలో అర ఎకరం వరకు రైతులు సాగు చేశారు. ఎకరాకు పెట్టుబడి రూ.20వేల నుంచి 30వేల వరకు అవుతుండగా సుమారు 30నుంచి 40క్వింటాళ్ల దిగుబడి వస్తోంది. కేజీ బంతిపూలు ప్రస్తుతం రూ.120వరకు విక్రయిస్తుండడంతో ఆదాయం సైతం అధికంగానే వస్తోందని రైతులు చెబుతున్నారు. దసరా అనంత రం దీపావళి వరకూ విక్రయాలు బాగుండటంతో బంతిసాగు లాభాల బాటగా మారింది. మండలం లోని రైతులు గత మూడేళ్లుగా బంతిసాగును చేపడుతూ లాభాలను గడిస్తున్నారు.
- వాణిజ్య పంటల వైపు చూపు..
ప్రస్తుతం ఎక్కడ చూసినా రైతులు ఎక్కువ మొ త్తంలో వాణిజ్య పంటలు సాగు చేస్తూ అవసరాల సాగు అయిన కూరగాయలు, పప్ప దినుసుల సాగును పూర్తిగా మానేయడంతో వాటికి తీవ్ర కొర త ఏర్పడుతోంది. ఇదే అదునుగా భావించిన రైతు లు వినూత్నంగా భావించి అధిక ఆదాయాన్ని సమ కూర్చుకునేందుకు పూలసాగుకు శ్రీకారం చుట్టారు. సీజన్‌కు అనుగుణంగా వినూత్న పంటలు సాగు చేసి పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ప్రస్తుతం పూలకు ఉన్న డిమాండ్ మేరకు పండగలకు ఉన్న ప్రాదాన్యతను గుర్తించి సాగుబాట పట్టారు. ఏ శుభ కార్యంలోనైనా పూలకు ఉండే ప్రాధాన్యం చెప్పనక్క ర్లేదు. దీంతో బంతిపూల సాగుకు శ్రీకారం చుట్టారు.
తక్కువ పెట్టుబడి..
- వడాయి పోశన్న, రైతు, హేటిగూడ
బంతిసాగు చేపట్టడం వల్ల తక్కువ పెట్టుబడితో ఆశించిన దిగుబడి వస్తుంది. ఏటా మాకున్న కొద్దిపాటి భూమిలో దసరా సమయానికి పూలు వచ్చేలా బంతిసాగు చేస్తుంటాం. బతుకమ్మలకు కావాల్సిన పూలను అందజేస్తుంటాం. అమ్మకాలు ఆ శాజనకంగా లాభదాయకంగానే ఉంటాయి. దీపావ ళి వరకు ఇక్కడ విక్రయాలు ఉంటాయి.