Share News

సాగునీటికి తొలగనున్న ఇబ్బందులు....

ABN , Publish Date - Dec 24 , 2025 | 11:05 PM

మంచి ర్యాల నియోజక వర్గం పరిధిలో సాగునీరు సకాలంలో అందక నానా ఇబ్బందులు పడుతున్న ఆయకట్టు రైతు ల బాధలు ఇక తీరనున్నాయి. కొత్తగా రూ.74.40 కోట్ల అంచనా వ్యయంతో నాలుగు మినీ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ పథ కాలు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చే సింది.

సాగునీటికి తొలగనున్న ఇబ్బందులు....

-గోదావరి బేసిన్‌లో నాలుగు లిఫ్ట్‌లు మంజూరు

-ఎనిమిదివేల ఎకరాల ఆయకట్టుకు నీరివ్వడమే లక్ష్యం

-రూ. 74.40 కోట్ల అంచనా వ్యయంతో త్వరలో టెండర్లు

-2027 మొదటి పంట నుంచి అందుబాటులోకి

-పరిపాలనా అనుమతులు మంజూరు చేసిన ప్రభుత్వం

మంచిర్యాల, డిసెంబరు 24 (ఆంధ్రజ్యోతి): మంచి ర్యాల నియోజక వర్గం పరిధిలో సాగునీరు సకాలంలో అందక నానా ఇబ్బందులు పడుతున్న ఆయకట్టు రైతు ల బాధలు ఇక తీరనున్నాయి. కొత్తగా రూ.74.40 కోట్ల అంచనా వ్యయంతో నాలుగు మినీ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ పథ కాలు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చే సింది. దీంతో దశాబ్దాల తరువాత ఆయకట్టు రైతుల ఇ బ్బందులు తప్పనుండగా, ప్రభుత్వ నిర్ణయం పట్ల హ ర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఆయకట్టుకు నీటిని ఎ త్తిపోసేందుకు గోదావరి బేసిన్‌లో జిల్లాకు నాలుగు ఎ త్తిపోతల పథకాలు మంజూరుకాగా దండేపల్లి, లక్షెట్టి పేట మండలాల్లో ఏర్పాటు చేయనున్నారు. 2023 అ సెంబ్లీ ఎన్నికల సమయంలో మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కి రాల ప్రేంసాగర్‌రావు ఆయకట్టు రైతులకు ఇచ్చిన హా మీలో భాగంగా రేవంత్‌రెడ్డి ప్రభుత్వం నియోజక వర్గా నికి నాలుగు ఎత్తిపోతల పథకాలు మంజూరు చేస్తూ గత నెల 29వ తేదీన జీవో నెంబరు 331 ద్వారా ఉత్త ర్వులు జారీ చేయగా, త్వరలో టెండర్లు ఆహ్వానించేం దుకు నీటిపారుదల శాఖ అధికారులు అవసరమైన ఏ ర్పాట్లు చేస్తున్నారు.

లక్ష్యం మేరకు నీరివ్వని గూడెం లిఫ్ట్‌...

దండేపల్లి మండలం గూడెం గ్రామం వద్ద గోదావరి పై 3 టీఎంసీల సామర్థ్యంతో రూ. 125 కోట్ల వ్యయంతో ఎత్తిపోతల పథకాన్ని నిర్మించారు. 2009 ఫిబ్రవరి 20న కాంట్రాక్టర్‌తో అగ్రిమెంట్‌ పూర్తికాగా హైద్రాబాద్‌లోని మెగా ఇంజనీరింగ్‌ సంస్థకు పనులు అప్పగించారు. 2009లో ప్రారంభమైన లిఫ్ట్‌ పనులు ఆరేళ్లపాటు కొన సాగగా 2015లో అందుబాటులోకి వచ్చింది. జిల్లాలోని దండేపల్లి, లక్షెట్టిపేట, హాజీపూర్‌ మండలాల్లో 30వేల ఎకరాలకు సాగు నీరందించే లక్ష్యంతో ఎత్తిపోతల పథ కానికి రూపకల్పన జరిగింది. అయితే జీఆర్పీ పైపులతో లిఫ్ట్‌ ప్రారంభించిన మొదటి ఏడాదే సమస్యలు ప్రారం భం అయ్యాయి. లిఫ్ట్‌లోని రెండు మోటార్లు ఆన్‌ చేస్తేనే 290 క్యూసెక్కుల నీరు ఎత్తిపోసి మూడు మండలాల్లోని పంటలకు సరిపడా అందే అవకాశాలు ఉంటాయి. ఇలా రెండు మోటార్లు ఆన్‌చేసిన ప్రతిసారీ ప్రెజర్‌కు తట్టుకో లేక జీఆర్పీ పైపులు ఎక్కడికక్కడే పగిలిపోయి, లక్ష్యం నెరవేరకుండా పోయింది. జీఆర్పీ పైపులు తరుచుగా ప గిలిపోతుండటం, యాసంగి సాగుకు నీరందక రైతులు ఇబ్బందులు పడుతుండటంతో ఆ స్థానంలో తిరిగి ఎం ఎస్‌ పైపులు వేయాలనే నిర్ణయానికి వచ్చారు. లిఫ్ట్‌ నుంచి కనీసం ఆరు కిలో మీటర్ల మేర ఎంఎస్‌ పైపు లైను వేస్తే ప్రెజర్‌కు పగిలిపోకుండా ఉండే అవకాశం ఉండటంతో జీఆర్పీ పైపులను తొలగించి, వాటి స్థానం లో రూ. 40 కోట్ల అంచనా వ్యయంతో 2023లో ఎంఎస్‌ పైపులైన్‌ నిర్మాణం చేపట్టారు. అప్పటి నుంచి కొంత మేర సాగునీరు అందుతుండగా, ఎల్లంపల్లి నీటి మట్టా నికి ఎత్తులో లిఫ్ట్‌ను నిర్మించడంతో ముఖ్యంగా వేసవి కాలంలో నీరందక పంపింగ్‌ నిలిచిపోయేది. దీంతో యా సంగి సీజన్‌లో కొన్ని గ్రామాల ప్రజలు సాగునీటి కోసం బోర్లపై ఆధారపడేవారు.

అందుబాటులోకి ఎనిమిది వేల ఎకరాల ఆయకట్టు...

ఎల్లంపల్లి ప్రాజెక్టుకు ఎగువున గోదావరిపై కొత్తగా మంజూరైన నాలుగు ఎత్తిపోతల పథకాల వల్ల జిల్లాలో ని దండేపల్లి, లక్షెట్టిపేట మండలాల్లోగల ఎనిమిదివేల పై చిలుకు ఎకరాల ఆయకట్టు కొత్తగా అందుబాటులోకి రానుంది. ఇంతకాలం కడెం కెనాల్‌పై ఆధారపడి గూ డెం ఎత్తిపోతల పథకం ద్వారా దండేపల్లి, లక్షెట్టిపేట, హాజీపూర్‌ మండలాల్లోని 30వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు ఇవ్వాలని నిర్ణయించినా, పూర్తిస్థాయిలో నీ రందక రైతులు ఇబ్బందులు పడేవారు. చెరువులు, బావులపై ఆధారపడి పంటలు సాగు చేసేవారు. ము ఖ్యంగా యాసంగి సీజన్‌లో పూర్తిస్థాయిలో నీరందేది కా దు. గూడెం ఎత్తిపోతల పథకం నీరు లక్షెట్టిపేట మండ లంలోని గంపలపల్లి వరకే రావడంతో మిగతా గ్రామాల తోపాటు హాజీపూర్‌ మండలంలోని రైతులు వానాకాలం సాగుపైనే ఆధారపడేవారు. ప్రస్తుతం కొత్త లిఫ్ట్‌లు మం జూరు కావడంతో లక్ష్యం మేరకు పూర్తిస్థాయిలో నీరం దనుంది. కొత్తగా మంజూరైన వాటిలో లక్షెట్టిపేట మం డలంలోని మోదెల, దండేపల్లి మండలంలోని గూడెం, ద్వారక, గుడిరేవు గ్రామాల్లో ఒక్కొక్కటి చొప్పున రూ. 74.40 కోట్ల అంచనా వ్యయంతో ఏర్పాటు చేయనుండ గా జనవరిలో టెండర్లు ఆహ్వానించనున్నారు. ఇందులో మోదెల లిఫ్ట్‌ కోసం రూ. 14.74 కోట్లు వెచ్చిస్తుండగా, గూడెం లిఫ్ట్‌కు రూ. 27.36 కోట్లు, ద్వారక లిఫ్ట్‌కు రూ. 17.26 కోట్లు, గుడిరేవు లిఫ్ట్‌కు రూ. 15.04 కోట్లు వెచ్చి స్తున్నారు. ఇదిలా ఉండగా 2027 యాసంగి సీజన్‌కల్లా ఎత్తిపోతల పథకాల నిర్మాణ పనులు పూర్తిచేసి, మొద టి పంటకు సాగునీరు అందించేందుకు డీపీఆర్‌ సైతం సిద్దం చేశారు.

లిఫ్ట్‌ మంజూరు హర్షనీయం....

మూల గంగాధర్‌, రైతు మోదెల గ్రామం

గూడెం లిఫ్ట్‌ ఆధారంగా ఇంతకాలం యాసింగిలో పూర్తిస్థాయిలో సాగునీరు అందేదికాదు. దీంతో బావు లపై ఆధారపడే వాళ్లం. వేసివిలో బావులు కూడా ఎండి పోయి పంట చేతికి వచ్చేదికాదు. ఎమ్మెల్యే ప్రేంసా గర్‌రావు కృషితో మోదెలకు ప్రత్యేకంగా మినీ లిఫ్ట్‌ మం జూరు కావడం సంతోషకరం. కొత్త లిఫ్ట్‌తో నాతోపాటు గ్రామంలోని రైతులకు సాగునీటి ఇబ్బందులు తప్పుతాయి.

Updated Date - Dec 24 , 2025 | 11:05 PM