సమస్యలు పరిష్కరించాలి
ABN , Publish Date - Jun 06 , 2025 | 11:13 PM
మున్సిపాలిటిల్లోని పలువార్డుల్లో సమ స్యలు పరిష్కరించాలని కోరుతూ శుక్రవారం సీపీఐ నాయకులు మున్సిపల్ కమిషనర్‌కు వినతిపత్రం అందజేశారు.
బెల్లంపల్లి, జూన్6(ఆంధ్రజ్యోతి): మున్సిపాలిటిల్లోని పలువార్డుల్లో సమ స్యలు పరిష్కరించాలని కోరుతూ శుక్రవారం సీపీఐ నాయకులు మున్సిపల్ కమిషనర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈసందర్భంగా పలువురు నాయకు లు మాట్లాడుతూ పట్టణంలోని పలువార్డుల్లో అత్యవసర సమయాల్లో అం బులెన్స్‌లు పోయేందుకు కూడ వీలులేకుండా స్థలాలు కబ్జా చేశారని వెంట నే చర్యలు తీసుకోవాలని కోరారు. అక్రమ నిర్మాణాలను తొలగించి సమస్యలు పరిష్కరించాలన్నారు. పలువార్డుల్లో ఎక్కడ పడితే అక్కడ చెత్తచెదారం ఉం టుందని దీంతో రానున్న వర్షాకాలం నేపథ్యంలో ప్రజలు అనారో గ్యభారిన ప డే అవకాశాలు ఉన్నాయన్నారు. పారిశుధ్య చర్యలు పకడ్బందీగా చేపట్టాల ని, వీధీ దీపాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. రాజీవ్ యువ వికా స్, ఇందిరమ్మ ఇండ్లను అర్హులైన లబ్దిదారులకు కేటాయించాలని సూచిం చారు. మిషన్ భగీరథ పైప్‌లైన్ లీకేజీలతో ప్రతి రోజు నీరు సరఫరా కావడం లేదని దీంతో ప్రజలు తాగునీటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. పట్ట ణంలోని పలువార్డులకు ఉపయోగకరంగా ఉండేందుకు కన్నాల బస్తీల సమ యంలో వైకుంఠదామం ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. సమస్యలు పరి ష్కరించేందుకు చొరవ చూపాలని లేని యెడల సీపీఐ ఆధ్వర్యంలో ఆందో ళనలు చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సమితి సభ్యురాలు బొల్లం పూర్ణిమ, పట్టణ కార్యదర్శి రాజమౌళి, సహాయ కార్యదర్శి తిలక్, నాయకులు ఉపేందర్, రాజేశ్, శంకర్‌లు పాల్గొన్నారు.