సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోవాలి
ABN , Publish Date - Sep 13 , 2025 | 11:33 PM
సమస్యలను సామరస్యంతో పరిష్కరించుకోవాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ పేర్కొన్నారు. శనివారం కలెక్టర్ చాంబర్‌లో దండేపల్లి మండలం దమ్మన్నపేట గ్రామ గిరిజనులతో మాట్లాడారు. కలెక్టర్ మాట్లాడుతూ సమస్యలను సామరస్యంతో పరిష్కరించుకోవాలని, భౌతిక దాడులకు పాల్పడవద్దన్నారు.
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్ కుమార్‌దీపక్
మంచిర్యాల కలెక్టరేట్, సెప్టెంబరు 13 (ఆంధ్రజ్యోతి) : సమస్యలను సామరస్యంతో పరిష్కరించుకోవాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ పేర్కొన్నారు. శనివారం కలెక్టర్ చాంబర్‌లో దండేపల్లి మండలం దమ్మన్నపేట గ్రామ గిరిజనులతో మాట్లాడారు. కలెక్టర్ మాట్లాడుతూ సమస్యలను సామరస్యంతో పరిష్కరించుకోవాలని, భౌతిక దాడులకు పాల్పడవద్దన్నారు. ఈ నెల 12న దండేపల్లి మండలం దమ్మన్నపేట , మామిడిగూడ గ్రామాల్లో గిరిజన ఘటనపై దమ్మన్నపేట గ్రామ గిరిజనులతో సమస్యలకు శాశ్వత పరిష్కారం దిశగా సామరస్యంతో ముందుకు వెళ్లాలన్నారు. అటవీ ప్రాంతాల్లో కమ్యూనిస్టు ఫారెస్ట్ మేనేజ్‌మెంట్ కింద గిరిజనులు వెదురు పంట సాగుకు ప్రోత్సహించడం జరుగుతుందన్నారు. అటవీ ప్రాంతాల్లో వెదురు పంట సాగు చేసేందుకు గుంతలు తవ్వడం, మొక్కలకు నీటిని అందించడం, యూరియా ఇతర పనులకు నిధులు మంజూరు చేయడమేకాకుండా వెదురు పంటను విక్రయించుకుని ఆదాయం పొందేందుకు అవకాశం కల్పిస్తామన్నారు. గిరిజనుల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతుందన్నారు. అధికార యంత్రాంగం గిరిజనులకు అండగా ఉంటుందని భౌతిక దాడులకు పాల్పడవద్దని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీపీ భాస్కర్, గిరిజనుల ప్రతినిధులు పాల్గొన్నారు.