సర్కార్ దవాఖానాలో సమస్యలు పరిష్కరించాలి
ABN , Publish Date - Aug 16 , 2025 | 11:22 PM
జిల్లా కేం ద్రంలోని సర్కార్ దవాఖా నాలో నెలకొన్న సమస్యల ను పరిష్కరించాలని సీపీ ఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ స భ్యుడు ఎం.బాలనరసింహ అన్నారు.
- సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు బాల నరసింహ
కందనూలు, ఆగస్టు 16 (ఆంధ్రజ్యోతి) : జిల్లా కేం ద్రంలోని సర్కార్ దవాఖా నాలో నెలకొన్న సమస్యల ను పరిష్కరించాలని సీపీ ఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ స భ్యుడు ఎం.బాలనరసింహ అన్నారు. నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని లక్ష్మ ణచారి భవన్‌లో ఈర్ల చంద్రమౌళి అధ్యక్షతన సీపీఐ జిల్లా కౌన్సిల్ సమావేశానికి పార్టీ జిల్లా కార్యదర్శి ఎస్‌ఎండీ ఫయాజ్, ఎం.బాలనరసిం హ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. బాల నర్సింహ మాట్లాడుతూ ప్రజలు రోగాల బారిన పడి ప్రభుత్వ ఆసుపత్రికి వస్తే అక్కడ సరిపడా పడకలు, మందులుగాని అందుబాటులో లేవని అన్నారు. చిన్న చిన్న రక్త పరీక్షలు కూడా చేయ కుండా ప్రైవేట్ ల్యాబ్‌లకు పంపడం వలన ప్ర జలు చాలా ఇబ్బంది పడుతున్నారన్నారు. అదే విధంగా అకాల వర్షాలకు నష్టపోయిన రైతు లకు నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని ప్ర భుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సమితి సభ్యుడు హెచ్.ఆనంద్‌జీ, కేశవులు గౌడ్, జిల్లా కార్యవర్గ సభ్యుడు పెబ్బేటి విజయు డు, కోళ్ల ఏసయ్య, జిల్లా సమితి సభ్యులు కృష్ణా జీ, శంకర్‌గౌడ్, మర్యాద వెంకటయ్య, బొలెద్దుల శ్రీను, రవీందర్, విద్యశ్రీను, బండి లక్ష్మీపతి, తుమ్మల శివుడు, మారేడు శివశంకర్, బాల మురళి, వెంకటమ్మ, కిరణ్‌కుమార్, ఖాజామైను ద్దీన్, పరశురాములు, గోపాల్, ఆంజనేయులు, మధుగౌడ్, నరేష్ పాల్గొన్నారు.