Fee Hike: నేటితో ముగియనున్న టీఏఫార్సీ వ్యక్తిగత విచారణలు
ABN , Publish Date - Sep 03 , 2025 | 05:07 AM
రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన కొత్త మార్గదర్శకాల మేరకు.. ఫీజుల పెంపుపై ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల యాజమాన్యాల ..
రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన కొత్త మార్గదర్శకాల మేరకు.. ఫీజుల పెంపుపై ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల యాజమాన్యాల వ్యక్తిగత విచారణల ప్రక్రియ కొనసాగుతోంది. గతనెల 25న ప్రారంభమైన ఈ ప్రక్రియ బుధవారంతో ముగియనుంది. మంగళవారం వరకు 141 కాలేజీల యాజమాన్యాలు వివరణ ఇచ్చాయి. రాష్ట్రంలో మొత్తం 160 ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలు ఉండగా.. బుధవారం మిగతా 19 కాలేజీలు హాజరు కానున్నాయి. అనంతరం టీఏఎ్‌ఫఆర్సీ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపనుంది.