భారంగా..ప్రైవేటు విద్య
ABN , Publish Date - May 24 , 2025 | 10:39 PM
సామాన్య జనాలకు ప్రైవేటు విద్య భారంగా మారింది. రాష్ట్ర వ్యాప్తం గా మరో పక్షం రోజుల్లో పాఠశాలలు పున:ప్రారంభం కానున్నాయి. ఇప్పటి నుంచే ప్రైవేట్ పాఠశాలల యా జమాన్యాలు అడ్మిషన్ల పేరుతో హడావుడి చేస్తున్నాయి.
ప్రైవేటు పాఠశాలల్లో ప్రారంభమైన చేరికలు
పుస్తకాలతో సహా అన్నీ కొనాల్సిందే
మంచిర్యాల, మే 24 (ఆంధ్రజ్యోతి): సామాన్య జనాలకు ప్రైవేటు విద్య భారంగా మారింది. రాష్ట్ర వ్యాప్తం గా మరో పక్షం రోజుల్లో పాఠశాలలు పున:ప్రారంభం కానున్నాయి. ఇప్పటి నుంచే ప్రైవేట్ పాఠశాలల యా జమాన్యాలు అడ్మిషన్ల పేరుతో హడావుడి చేస్తున్నాయి. ఓ వైపు ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులకు ప్ర భుత్వం శిక్షణ తరగతులు నిర్వహిస్తుండగా, ప్రైవేట్ స్కూళ్లలో మాత్రం అడ్మిషన్ల ప్రక్రియ వేగంగా కొనసా గుతోంది. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చేరికల కో సం బడిబాట కార్యక్రమం ప్రారంభించే లోపే వీలైనం త ఎక్కువగా అడ్మిషన్లు సేకరించాలనే లక్ష్యంతో ప్రై వేట్ యాజమాన్యాలు ఉన్నాయి. పాఠశాలలు పున:ప్రా రంభమయ్యే నాటికి సరిపడా విద్యార్థులను నింపుకునే పనిలో నిమగ్నమయ్యాయి. అడ్మిషన్ టెస్ట్‌ల పేరుతో వి ద్యార్థులను చేర్చుకొనే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారు. ఇందులో భాగంగా ముందస్తుగా పుస్తకాలు, యూనిఫాం, తదితర వస్తువులను అంటగడుతున్నారు. జూన్ 12 నుంచి పాఠశాలలు ప్రారంభం కానుండగా ఇప్పటి నుంచే విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లల చదువు కోసం సమాయత్తం కావాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.
చుక్కలనంటుతున్న ధరలు...
పాఠశాలల విద్యార్థులకు అవసరమయ్యే వస్తువులు ధరలు చుక్కలనంటుతున్నాయి. అనేక చోట్ల పాఠశాల ల్లో పాఠ్యపుస్తకాలు మొదలుకొని, బూట్ల వరకు అధిక ధరలకు విక్రయిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నా యి. బయట మార్కెట్‌తో పోల్చితే పాఠశాలల్లో విక్ర యించే వివిధ సామగ్రి ధరలు అధికంగా ఉంటున్నా యనే అభిప్రాయాలు ఉన్నాయి. పుస్తకాలతో సహా వి ద్యార్థి ధరించే యూనిఫాం, స్నాక్స్, బూట్లు, బెల్టుపై తమ పాఠశాల పేరే ఉండాలనే నిబంధన ఉండటంతో తల్లిదండ్రులు ధరలు ఎక్కువైనా కొనక తప్పని పరిస్థి తులు నెలకొన్నాయి. కుటుంబంలో ఇద్దరు పాఠశాలకు వెళ్లే పిల్లలు ఉన్న చోట రూ. 15 వేల నుంచి 20 వేల వరకు కేవలం వస్తువుల కొనుగోలుకే వెచ్చించాల్సి వ స్తుందని పలువురు పోషకులు వాపోతున్నారు. యాజ మాన్యాల వైఖరితో మద్యతరగతి వర్గాల ప్రజల పై తీవ్ర భారం పడుతోంది. ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాద్యమంలోనూ పూర్తి ఉచిత బోధన లభిస్తున్నప్పటి కీ చదువులో నాణ్యత ఉండదనే భావనతో అత్యధిక మంది అష్టకష్టాలు పడి తమ పిల్లలను ప్రైవేట్ స్కూ ళ్లలోనే చేర్పిస్తున్నట్లు తెలుస్తోంది.
సామాన్యులకు భారంగా..
విద్యార్థుల తల్లిదండ్రుల అవసరాన్ని అవకాశంగా మలుచుకుంటున్న కొన్ని పాఠశాలల యాజమాన్యాలు ఇష్టారీతిన అడ్డగోలుగా ఫీజులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఫీజుల నియంత్రణపై ప్రభుత్వ పరంగా ఎలాంటి అజమాయిషీ లేకపోవడంతో యాజమాన్యాలు ఆడిందే ఆటగా సాగుతోంది. ఆంగ్ల మాద్యమంలో ఎల్‌కేజీ అభ్యసించే విద్యార్థికి సంవత్సరానికి క నీసం రూ. 20 వేలు వసూలు చేస్తుండగా ప్రైమరీ తరగతుల స్కాలర్‌కు రూ. 20 వేల నుంచి 50 వేలు వసూలు చేస్తున్నారు. దీంతో పాటు వేలల్లో అడ్మిషన్ ఫీజులు సైతం వసూలు చేస్తూ తల్లిదండ్రుల నడ్డి విరిస్తున్నారు. హాస్టళ్లలో ఉండి చదువుకు(కొ)నే వారి పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. సంవత్సరానికి ఒ క్కో విద్యార్థికి రూ. 80 వేల పైనే వసూలు చేస్తున్నా రు. దీంతో పాటు కొన్ని పాఠశాలల్లో నోటు పుస్తకాలు, టెక్ట్స్ బుక్కులు, యూనిఫాంలు, సాక్సులు, టీషర్ట్‌లు అ మ్ముతున్నారు.
కనీస సౌకర్యాల కల్పించడంలో విఫలం...
వేల రూపాయల్లో ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవే ట్ పాఠశాలల యాజమాన్యాలు విద్యార్థులకు మౌలిక వసతులు కల్పించడంలో విఫలమయ్యారనే ఆరోపణ లు సర్వత్ర వ్యక్తం అవుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా వందల సంఖ్యలో ప్రైవేట్ పాఠశాలలు ఉండగా చాలా వాటికి విద్యార్థులు ఆడుకునేందుకు ఆటస్థలం లేకపోవడం శోచనీయం. రెండు మూడంతస్థుల్లో పాఠశాలలు నడుపుతూ విద్యార్థులను క్రీడలకు దూరం చేస్తున్నా అడిగేవారు కరువయ్యారు. ప్లే స్కూళ్ల పేరిట పాఠశాలలు నిర్వహిస్తూ ప్రీ ప్రైమరి తరగతుల విద్యార్థులకు ఇరుకు గదిలో ఆట వస్తువులు ఏర్పాటు చేసి కుక్కుతున్నారు.
నిబంధనలు అమలయ్యేనా...?
2025-26 విద్యా సంవత్సరం ఆరంభం కానుండగా, ప్రైవేట్ స్కూళ్లలో నిబంధనలు అమలయ్యేలా చర్యలు చేపట్టవలసిన బాధ్యత విద్యాశాఖ అధికారులపై ఉంది. ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు విద్యను వ్యాపా రంగా మార్చి తల్లిదండ్రులను నిలువు దోపిడీకి గురి చేస్తున్నందున నిబంధనలపట్ల కఠినంగా వ్యవహరిం చాల్సిన అవసరం ఉంది. పాఠశాలలు విధిగా ప్రభుత్వ గుర్తింపు పొంది ఉండటం, క్రీడా మైదానం ఏర్పాటు, అగ్నిమాపకశాఖ పరికరాల ఏర్పాటు విషయంలో వెసు లుబాటు కల్పించవద్దనే అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తవుతున్నాయి.