Share News

FEE Reimbursement: దీపావళిలోపు రూ.300 కోట్ల విడుదలకు హామీ

ABN , Publish Date - Oct 09 , 2025 | 05:57 AM

ఈ నెల 13వ తేదీ నుంచి సమ్మె చేస్తామని ప్రకటించిన ప్రైవేటు కళాశాలల యాజమాన్య సంఘాల సమాఖ్య(ఫాతీ) దాన్ని వాయిదా వేసింది....

FEE Reimbursement: దీపావళిలోపు రూ.300 కోట్ల విడుదలకు హామీ

  • ప్రైవేటు కాలేజీల సమ్మె వాయిదా.. విడుదల చేయకుంటే 23 నుంచి సమ్మె

  • ప్రకటించిన యాజమాన్య సంఘాల సమాఖ్య

హైదరాబాద్‌, అక్టోబరు 8 (ఆంధ్రజ్యోతి) : ఈ నెల 13వ తేదీ నుంచి సమ్మె చేస్తామని ప్రకటించిన ప్రైవేటు కళాశాలల యాజమాన్య సంఘాల సమాఖ్య(ఫాతీ) దాన్ని వాయిదా వేసింది. దీపావళిలోపు రూ. 300 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చేయించేందుకు కృషి చేస్తానని ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్‌ రెడ్డి ఇచ్చిన హామీతో సమ్మె వాయిదా వేశామని ఫాతీ బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ నెల 22లోపు బకాయిలు విడుదల చేయకుంటే 23 నుంచి సమ్మె చేస్తామని ఫాతీ చైర్మన్‌ నిమ్మగడ్డ రమేష్‌ బాబు తెలిపారు. సమ్మె వాయిదా గురించి బుధవారం నిర్వహించిన అత్యవసర కార్యవర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. దసరాలోపు ప్రభుత్వం విడుదల చేసిన రూ. 200 కోట్లలో రాష్ట్రంలోని 72 మైనార్టీ కళాశాలలకు ఒక్క పైసా కూడా బకాయిలు చెల్లించలేదని, వెంటనే విడుదల చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

Updated Date - Oct 09 , 2025 | 05:57 AM