Share News

kumaram bheem asifabad- గిరిజనుల అభివృద్ధికి ప్రాధాన్యం

ABN , Publish Date - Sep 25 , 2025 | 11:00 PM

గిరిజనుల అభివృద్ధికి ప్రాధాన్యమి స్తున్నామని గిరిజన సంక్షేమ శాఖ ఉప సంచాలకురాలు రమాదేవి అన్నారు.గిరిజనుల సమగ్ర అభివృద్ది కోసం కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి జన జాతీయ గ్రామీణ ఉత్కర్స్‌ అభియాన్‌ పథకం ద్వారా గిరిజనులకు అందిస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలు గిరిజనులకు అందుతున్నాయా లేదా అనే విషయాన్ని గురువారం కేంద్ర ప్రభుత్వ అధికార ప్రతినిధి బృందం జిల్లాలోని ఆసిఫాబాద్‌ మండలం రౌటసంకెపల్లి గ్రామంలో పరిశీలించారు. గిరిజనులతో ముఖాముఖి చర్చలు జరిపారు.

kumaram bheem asifabad- గిరిజనుల అభివృద్ధికి ప్రాధాన్యం
గ్రామంలో అవగాహన ర్యాలీ నిర్వహిస్తున్న అధికారులు, గ్రామస్థులు

ఆసిఫాబాద్‌రూరల్‌, సెప్టెంబరు 25 (ఆంధ్రజ్యోతి): గిరిజనుల అభివృద్ధికి ప్రాధాన్యమి స్తున్నామని గిరిజన సంక్షేమ శాఖ ఉప సంచాలకురాలు రమాదేవి అన్నారు.గిరిజనుల సమగ్ర అభివృద్ది కోసం కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి జన జాతీయ గ్రామీణ ఉత్కర్స్‌ అభియాన్‌ పథకం ద్వారా గిరిజనులకు అందిస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలు గిరిజనులకు అందుతున్నాయా లేదా అనే విషయాన్ని గురువారం కేంద్ర ప్రభుత్వ అధికార ప్రతినిధి బృందం జిల్లాలోని ఆసిఫాబాద్‌ మండలం రౌటసంకెపల్లి గ్రామంలో పరిశీలించారు. గిరిజనులతో ముఖాముఖి చర్చలు జరిపారు. ఈ సందర్భంగా గ్రామంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. అనంతరం గిరిజన సంక్షేమ శాఖ ఉప సంచాలకురాలు రమాదేవి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం గిరిజన ప్రజల అభివృద్ధికి అన్ని విధాల చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. జిల్లాలో 102 గిరిజన గ్రామాల్లో అభివృద్ధి కోసం ఈ పథకం ప్రారంభించామని అన్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి మాట్లాడుతూ ఈ పథకం ద్వారా గిరిజనులకు ఆధార్‌, అయూష్మాన్‌భారత్‌ అన్ని రకాల మౌలిక సదుపాయాలు, నిరుద్యోగ గిరిజన విద్యార్థులకు శిక్షణ ఇప్పించి ఉపాధి చూపనున్నామని అన్నారు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం గిరిజన ప్రజలకు వారికి దగ్గర్లోనే ఆధార్‌ క్యాంపును పెట్టి గిరిజన ప్రజలకు పీఎం జుగా కార్యక్రమంలో భాగంగా ఆధార్‌ కార్డు, ఆయూష్మాన్‌, ఆరోగ్య కార్డు, కులం ధువీకరణ పత్రం, కిసాన్‌ క్రెడిట్‌ కార్డు, జన్‌ధన్‌ అకౌంట్‌ తదితర లాభాలు చేకూర్చడానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏటీడీవోలు శ్రీనివాస్‌, చిరంజీవి, కార్యదర్శులు మధుకర్‌, ఉపాధ్యాయులు శంకర్‌, గోపాల్‌, మమత, కవిత, తిరుపతి, పోశం, తిరుపతి, కిష్టయ్య, కొండు పటేల్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 25 , 2025 | 11:00 PM