Share News

మౌలిక సదుపాయల కల్పనకు ప్రాధాన్యం : ఎమ్మెల్యే

ABN , Publish Date - Mar 11 , 2025 | 12:35 AM

గ్రా మీణ ప్రాంతా ల్లో ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రా ధాన్యమివ్వనున్నట్లు ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు.

 మౌలిక సదుపాయల కల్పనకు ప్రాధాన్యం : ఎమ్మెల్యే

మౌలిక సదుపాయల కల్పనకు ప్రాధాన్యం : ఎమ్మెల్యే

నార్కట్‌పల్లి, మార్చి 10 (ఆం ధ్రజ్యోతి): గ్రా మీణ ప్రాంతా ల్లో ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రా ధాన్యమివ్వనున్నట్లు ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. నార్కట్‌పల్లి మండలంలోని ఏపీలింగోటంలో రూ.5 లక్షల అంచనా వ్యయంతో ఏర్పాటు చేసిన నీటిశుద్ధి కేంద్రాన్ని సోమవారం ఆయన ప్రారంభించారు. అనంతరం నూతనంగా నిర్మించిన పెద్దమ్మతల్లి ఆలయంలో జరిగిన విగ్రహ ప్రతిష్ఠ పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆలయాల నిర్మాణం తో ప్రజల్లో భక్తిభావం ఏర్పడుతుందని పెద్దమ్మ తల్లి ఆశీస్సులతో ప్రజలు చల్లగా ఉండాలని వేడుకున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షు డు బత్తుల ఊశయ్య, నాయకులు బండ సాగర్‌రెడ్డి, శంకర్‌, దూదిమెట్ల సత్తయ్య, వడ్డే భూపాల్‌రెడ్డి, గాయం శ్యాంసుందర్‌రెడ్డి, గడ్డం పశుపతి పాల్గొన్నారు. ఏపీలింగోటంలో జరిగిన పెద్దమ్మ తల్లి నూతన విగ్రహప్రతిష్ఠ పూజల్లో మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పాల్గొన్నారు. ఆయన వెంట నాయకులు దుబ్బాక శ్రీధర్‌, నడింపల్లి నరేష్‌ ఉన్నారు.

Updated Date - Mar 11 , 2025 | 12:35 AM