ప్రధాని మోదీ దిష్టిబొమ్మ దహనం
ABN , Publish Date - Dec 18 , 2025 | 11:22 PM
పార్లమెంట్‌లో ఉపాధి హామీ పథకం నుంచి మహాత్మాగాంధీ పేరును తొలగించడాన్ని నిరసిస్తూ గురు వారం చెన్నూరు పట్టణంలోని పాత బస్టాండ్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిష్టిబొమ్మను కాంగ్రెస్ నాయకులు దహనం చేశారు.
చెన్నూరు, డిసెంబరు 18 (ఆంధ్రజ్యోతి) : పార్లమెంట్‌లో ఉపాధి హామీ పథకం నుంచి మహాత్మాగాంధీ పేరును తొలగించడాన్ని నిరసిస్తూ గురు వారం చెన్నూరు పట్టణంలోని పాత బస్టాండ్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిష్టిబొమ్మను కాంగ్రెస్ నాయకులు దహనం చేశారు. ఈ సంద ర్భంగా నాయకులు మాట్లాడుతూ 1948లో గాడ్సే మహాత్మాగాంధీని శారీ రకంగా హత్య చేశాడని, ఇప్పుడు ప్రధాని మోదీ ఆయన పేరును చంపే ప్రయత్నం చేస్తుందన్నారు. కోట్లాది ప్రజలకు జీవనాధారంగా నిలిచిన ఉ పాధి హామీ పథకం నుంచి గాంధీ పేరును తొలగించడం ఎంత మాత్రం సరైంది కాదన్నారు. కేంద్ర ప్రభుత్వం పేదల కోసం పనిచేయడం లేదని, కార్పొరేట్‌ల ప్రయోజనాల కోసం పనిచేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఈర్ల నారాయణ, నవాజ్, బషీర్, నాగరాజు, అంకగౌడ్, మ హేష్, జావీద్, అన్వర్, సలీం, కమలాకర్ పాల్గొన్నారు.