Share News

kumaram bheem asifabad- ఘనంగా ప్రధాని మోదీ జన్మదిన వేడుకలు

ABN , Publish Date - Sep 17 , 2025 | 11:20 PM

ప్రధాని నరేంద్రమోదీ జన్మదిన వేడుకలను బుధవారం జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో ఆ పార్టీ జిల్లా ఆధ్యక్ష, ప్రదాన కార్యదర్శులు దోని శ్రీశైలం, అరిగెల మల్లిఖార్జున్‌ యాదవ్‌ల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్బంగా కేక్‌ కట్‌ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం ప్రధాని 76వ పుట్టిన రోజు సందర్భంగా 76 మంది బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు రక్తదా నం చేశారు.

kumaram bheem asifabad- ఘనంగా ప్రధాని మోదీ జన్మదిన వేడుకలు
రక్తదానం చేస్తున్న బీజేపీ నాయకులు

ఆసిఫాబాద్‌రూరల్‌, సెప్టెంబరు 17 (ఆంధ్రజ్యోతి): ప్రధాని నరేంద్రమోదీ జన్మదిన వేడుకలను బుధవారం జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో ఆ పార్టీ జిల్లా ఆధ్యక్ష, ప్రదాన కార్యదర్శులు దోని శ్రీశైలం, అరిగెల మల్లిఖార్జున్‌ యాదవ్‌ల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్బంగా కేక్‌ కట్‌ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం ప్రధాని 76వ పుట్టిన రోజు సందర్భంగా 76 మంది బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు రక్తదా నం చేశారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు కిరణ్‌, పెంటయ్య, ప్రహ్లద్‌, రాజేంద్రప్రసా ద్‌, శరత్‌, దీపక్‌రావు, మురళీగౌడ్‌, శ్రీకాంత్‌, సంతోష్‌, కోటేష్‌ పాల్గొన్నారు.

బెజ్జూరు, (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలో బీజేపి ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్రమోదీ జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా పేద కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో బీజేపీ మండల అద్యక్షుడు జాడి తిరుపతి, నాయకులు తంగడిపల్లి నిలేష్‌, సంజీవ్‌, తిరుపతి, రాకేష్‌, శ్యామల కిరణ్‌, బాలకృష్ణ, రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.

చింతలమానేపల్లి, (ఆంధ్రజ్యోతి) మండలంలో బీజేపీ నాయకులు ప్రధాని నరేంద్రమోదీ జన్మదినం సందర్భంగా స్వీట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు డోకె రామన్న, జిల్లా కౌన్సిల్‌ సభ్యుడు ఎల్ములె మల్లయ్య, నాయకులు సత్పుతె తుకరాం, పవన్‌, రంగన్న, మెహన్‌, పోచన్న, ఓం, భిక్షపతి, జగదీష్‌ తివారీ, బాలయ్య, మురళి, పురుషోత్తం చారీ, నానాజీ, బాబురావు, కారూజీ, లచ్చన్న, భీెేుష్‌, సత్తయ్య, కిష్టయ్య తదితరులు పాల్గొన్నారు.

సిర్పూర్‌(టి), (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలో బీజేపీ నాయకులు ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన వేడుకలను నిర్వహిచారు. కార్యక్రమంలో బీజేపీ మండల ఆధ్యక్షురాలు లావణ్య తదితరులు పాల్గొన్నారు.

రెబ్బెన, (ఆంధ్రజ్యోతి): మండలలోని గోలేటి వృద్ధాశ్రమంలో ప్రధాని నరేంద్ర పోదీ జన్మదిన వేడుకలు నిర్వహిచారు. కార్యక్రమంలో బీజేపీ సీనియర్‌ నాయకులు కేసరి అంజనేయులు గౌడ్‌, జిల్లా కార్యదర్శి నవీన్‌గౌడ్‌ ఆశ్రమం నిర్వహకులు తేజ దుర్గం వ సంత్‌రావు, నంది శేఖర్‌, ఆవుల శేఖర్‌, దుర్గం సంతోష్‌, ఇగురపు మహేష్‌ పాల్గొన్నారు.

Updated Date - Sep 17 , 2025 | 11:20 PM