Share News

దేశ ప్రగతికి పాటుపడుతున్న ప్రధాని మోదీ

ABN , Publish Date - May 04 , 2025 | 11:22 PM

దేశ ప్రగతికి, ప్రజల సంక్షేమా నికి ప్రధాని నరేంద్రమోదీ నిరంతరం పాటు పడుతున్నారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్‌గౌడ్‌ పేర్కొన్నారు. ఆదివారం మందమ ర్రిలో ఆయన మాట్లాడుతూ మోదీ పనితీరు బాగున్నందునే ప్రజలు మూ డు సార్లు కేంద్రంలో అధికారం కట్టబెట్టారన్నారు.

దేశ ప్రగతికి పాటుపడుతున్న ప్రధాని మోదీ

మందమర్రిటౌన్‌, మే 4 (ఆంధ్రజ్యోతి) : దేశ ప్రగతికి, ప్రజల సంక్షేమా నికి ప్రధాని నరేంద్రమోదీ నిరంతరం పాటు పడుతున్నారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్‌గౌడ్‌ పేర్కొన్నారు. ఆదివారం మందమ ర్రిలో ఆయన మాట్లాడుతూ మోదీ పనితీరు బాగున్నందునే ప్రజలు మూ డు సార్లు కేంద్రంలో అధికారం కట్టబెట్టారన్నారు. ప్రజలకు గతంలో కాం గ్రెస్‌ ప్రభుత్వం ఏం చేసిందో ప్రజలకు చెప్పాలన్నారు. 75 ఏళ్లు అయినా కుల గణన ఎవరు చేపట్టలేదని, కానీ ఇటీవల బీజేపీ ప్రభుత్వం దేశ వ్యా ప్తంగా కుల గణన చేపట్టడానికి నిర్ణయం తీసుకుందన్నారు. దీంతో ప్రతి పక్ష పార్టీలు ఏం చేయాలో తెలియక దిక్కు తోచని స్థితిలో పడ్డాయ న్నా రు. పహెల్గాంలో పర్యాటకులపై ఉగ్రవాదుల దాడి పిరికిపందల చర్య అని మండిపడ్డారు. దేశంలో అలజడులు సృష్టించడానికి ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారన్నారు. ప్రపంచ దేశాలు కూడా పాకిస్తాన్‌ చర్యలను ఖం డిస్తున్నాయన్నారు. ఈ సమావేశంలో నాయకులు డీవీ దిక్షి తులు, చప్పిడి నరేష్‌, సంజీవరావు పాల్గొన్నారు.

ఫకేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ సోమవారం కొము రం భీంఆసిఫాబాద్‌ జిల్లాకు రానున్నారని వెంకటేశ్వర్‌గౌడ్‌, దుర్గం అశోక్‌లు తెలిపారు. ఆదివారం మందమర్రిలో వారు మాట్లాడుతూ శ్రీరాంపూర్‌ నుం చి వాంకిడి వరకు రూ. 3 వేల కోట్లతో నిర్మించిన జాతీయ రహదారిని ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారని తెలిపారు. అనంతరం సబ ఉంటుందని, నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో తరలి రావాలని కోరారు.

Updated Date - May 04 , 2025 | 11:22 PM