బీసీ రిజర్వేషన్లకు అడ్డుపడుతున్న ప్రధాని మోదీ
ABN , Publish Date - Aug 31 , 2025 | 11:52 PM
బీసీ ప్రధాని అని చెప్పుకుంటూ బీసీ రిజర్వేషన్లకు ప్రధానమంత్రి న రేంద్రమోదీ అడ్డుపడుతున్నారని సీపీ ఎం జిల్లా కార్యదర్శి వర్ధం పర్వతా లు డిమాండ్ చేశారు.
- సీపీఎం జిల్లా కార్యదర్శి పర్వతాలు
కొల్లాపూర్, ఆగస్టు 31 (ఆంధ్రజ్యో తి) : బీసీ ప్రధాని అని చెప్పుకుంటూ బీసీ రిజర్వేషన్లకు ప్రధానమంత్రి న రేంద్రమోదీ అడ్డుపడుతున్నారని సీపీ ఎం జిల్లా కార్యదర్శి వర్ధం పర్వతా లు డిమాండ్ చేశారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు పరుస్తూ ఎన్నికలు నిర్వహించాలని కొల్లాపూర్ మండల కేంద్రంలో సీపీఎం కార్యాల యంలో ఆదివారం ఆ పార్టీ మండల కమిటీ నాయకుడు ఎండీ సలీం అధ్యక్షతన పార్టీ మం డల సమావేశం నిర్వహించారు. ఆయన మా ట్లాడుతూ రాష్ట్రంలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లను కల్పి స్తూ ఎన్నికలు నిర్వహించాలని ఆయన ప్రభు త్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో బీసీల రిజర్వేషన్లు ఈ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తామని ముందుకు వస్తే కేంద్రంలో ఉన్న బీ జేపీ ప్రభుత్వం ఎందుకు అడ్డుపడుతుందో ప్రజ లకు సమాధానం చెప్పాలని అన్నారు. కార్యక్ర మంలో సీపీఎం పార్టీ మండల కార్యదర్శి శివ వర్మ, మండల కమిటీ సభ్యులు బాలపీరు, కిర ణ్ కుమార్, రాజు, రామకృష్ణ పాల్గొన్నారు.