Share News

kumaram bheem asifabad-పోషక లోప నివారణ.. ఆరోగ్య రక్షణ

ABN , Publish Date - Oct 14 , 2025 | 10:20 PM

మాతా శిశు సంరక్షణతో పాటు ఆరోగ్య వంతమైన నిర్మాణమే లక్ష్యంగా ప్రభుత్వం ఏటా పోషణ్‌ అభియాన్‌ మాసోత్సవాన్ని నిర్వహిస్తోంది. జిల్లాలో ఉన్న 1,005 అంగన్‌వాడీ కేంద్రాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నారు. అక్టోబరు 31 వరకు వివిధ కార్యక్రమాలు నిర్వహిం చేందుకు ఐసీడీఎస్‌ అధికారులు కార్యాచరణ రూ పొందించారు.

kumaram bheem asifabad-పోషక లోప నివారణ.. ఆరోగ్య రక్షణ
రెబ్బెనలో పోషకాహారంపై అవగాహన కల్పిస్తున్న సిబ్బంది

- పోషణ్‌ అభియాన్‌ మాసోత్సవంలో ఐసీడీఎస్‌ అధికారుల కార్యాచరణ

రెబ్బెన, అక్టోబరు 14 (ఆంధ్రజ్యోతి): మాతా శిశు సంరక్షణతో పాటు ఆరోగ్య వంతమైన నిర్మాణమే లక్ష్యంగా ప్రభుత్వం ఏటా పోషణ్‌ అభియాన్‌ మాసోత్సవాన్ని నిర్వహిస్తోంది. జిల్లాలో ఉన్న 1,005 అంగన్‌వాడీ కేంద్రాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నారు. అక్టోబరు 31 వరకు వివిధ కార్యక్రమాలు నిర్వహిం చేందుకు ఐసీడీఎస్‌ అధికారులు కార్యాచరణ రూ పొందించారు. అధికార గణాంకాల ప్రకారం జిల్లాలో బాలింతలు 2,373, గర్భిణులు 5.534, 0 నుంచి 3 నెలల శిశువులు 2.272, ఏడు నెలల నుంచి మూ డేళ్ల పిల్లలు 19,799 ఉన్నారు. గర్భిణులు, బాలింతలు, చిన్నారులు, కిషోర బాలికల్లో పౌష్టికాహారలోపాన్ని నివారించేందుకు పోషణ మాసం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఈ నెల 1 నుంచి అక్టోబరు 10 వరకు చేపట్టాల్సిన కార్యక్రమాలపై నిర్వహణ కోసం ఇప్పటికే ప్రత్యేక ప్రణాళికలను జిల్లాలోని ప్రాజెక్టును పంపించారు. ఇందు కోసం అంగన్‌వాడీ సిబ్బంది అంతా సిద్ధం చేశారు.

- మొదటి దఫాలో

మొదటి దఫాలో అంగన్‌వాడీ కేంద్రాల్లో గర్భిణులు, పాలిచ్చే తల్లులతో పిల పోషణపై సమావేశం నిర్వహిస్తున్నారు. పౌష్టికాహారం వంటలపై పోటీలు పరీక్షలు, పిల్లల ఎత్తు, బరువు చూడడం, ఆహారంలో చక్కెర, నూనె తగ్గించడం తల్లిదండ్రులతో పోషకాహార ప్రతిజ్ఙతలు, కథలు చెప్పడంతో పాటు స్థానిక ఉత్పత్తులపై అవగాహన స్థానిక వంటలను ప్రోత్సహించేలా చేస్తున్నారు. రెండో దఫాలో బిడ్డకు అందించే ముర్రుపాలు విశిష్టత, పిల్లలకు పోషణ తదితర అంశాలపై సమావేశాలు నిర్వహిస్తున్నారు. తల్లులతో పోషణ లోపం ఉన్న పిల్లల తల్లులతో అనుభవాలు పంచుకోవడం, చిరు ధాన్యాలు, పండ్లు కూరగాయాలపై సమావేశాలతో అవగాహన కల్పిస్తున్నారు. మూడో దఫాలో అతి తీవ్ర పోషణ లోపం ఉన్న పిల్లలకు ఆకలి పరీక్ష నిర్వహిస్తారు. రక్తహీనత, అధిక బరువుపై కిషోర బాలికలకు అవగాహన హెచ్‌బీ పరీక్షలు నిర్వహణ, అంగన్‌వాడీ కేంద్రాలు, యోగాసాధన పోషణ మిష న్‌ కార్యక్రమాలు చేపడుతున్నారు. నాలుగో దఫాలో మంచినీరు వ్యక్తిగత పరిశుభ్రత అవగాహన ఆరు నెలల లోపు వయస్సు పిల్లలు, గర్బిణుల ఇళ్ల సందర్శన అవగాహన, తక్కువ చక్కెర ఉన్న పదార్థాల ప్రదర్శన ఒక సారి వాడిన నూనెపడేసేలా అవగాహన కల్పించనున్నారు. ప్లాస్టిక్‌ వినియోగంతో వచ్చే అనర్ధాలను స్పష్టమైన అవగాహన కార్యక్రమాలు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నారు.

Updated Date - Oct 14 , 2025 | 10:20 PM