Share News

రోడ్డు ప్రమాదాల నివారణ ప్రతీ ఒక్కరి బాధ్యత

ABN , Publish Date - Nov 14 , 2025 | 11:06 PM

రోడ్డు ప్రమాదాల నివార ణ ప్రతీ ఒక్కరి బాధ్యత అని ట్రాఫిక్‌ నియమ నిబంధనలను పాటిస్తూ వా హనాలు నడుపడం వల్ల ఎలాంటి ప్రమాదాలు జరుగవని బెల్లంపల్లి ఏసీ పీ రవి కుమార్‌ తెలిపారు.

రోడ్డు ప్రమాదాల నివారణ ప్రతీ ఒక్కరి బాధ్యత

బెల్లంపల్లి ఏసీపీ రవి కుమార్‌

మందమర్రిటౌన్‌, నవంబరు14 (ఆంధ్రజ్యోతి): రోడ్డు ప్రమాదాల నివార ణ ప్రతీ ఒక్కరి బాధ్యత అని ట్రాఫిక్‌ నియమ నిబంధనలను పాటిస్తూ వా హనాలు నడుపడం వల్ల ఎలాంటి ప్రమాదాలు జరుగవని బెల్లంపల్లి ఏసీ పీ రవి కుమార్‌ తెలిపారు. శుక్రవారం మందమర్రి సర్కిల్‌పరిధిలోని జాతీ య రహదారి శ్రీనివాసగార్డెన్‌ నుంచి బొక్కల గుట్ట ఎక్స్‌ రోడ్డు వరకు బ్లాక్‌ స్పాట్లను ప్రత్యేకంగా పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ ప్రమాదాలను నివారించేందుకు కొన్ని ప్రాంతాలను గుర్తించామని ఆర్‌అండ్‌బీ అధికారు ల దృష్టికి తీసుకెళ్లామన్నారు. బొక్కలగుట్ట రోడ్డుపై వాహనాల వేగాన్ని త గ్గించడం ద్వారా రోడ్డు ప్రమాదాలను నివారించడంతో పాటు కొన్ని స్పీడు బ్రేకర్లు వేయాలని సూచించామన్నారు. గడిచిన రెండు రోజుల్లోనే రెండు ప్ర మాదాలు జరిగి ఇద్దరు మృత్యువాత పడ్డారని పేర్కొన్నారు. అంతే గాకుం డా వాహనదారులు హెల్మెట్‌లు తప్పకుండా ధరించాలని రోడ్డు భద్రత ప్రమాణాలు పాటించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మందమర్రి సీఐ శశిధర్‌ రెడ్డి, క్యాతన్‌పల్లి మున్సిపల్‌ కమిషనర్‌ రాజు, ఆర్‌అండ్‌బీ డీ ఈతో పాటు ట్రాఫిక్‌ ఎస్‌ఐ, రామకృష్ణాపూర్‌ ఎస్‌ఐలు పాల్గొన్నారు.

Updated Date - Nov 14 , 2025 | 11:06 PM