President Draupadi Murmu: హైదరాబాద్ చేరుకున్న రాష్ట్రపతి ముర్ము
ABN , Publish Date - Dec 18 , 2025 | 02:44 AM
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శీతాకాల విడిది కోసం హైదరాబాద్ చేరుకున్నారు. బుధవారం మధ్యాహ్నం 2:55 గంటలకు ప్రత్యేక విమానంలో హకీంపేట్ ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌కు చేరుకున్న ముర్ముకు గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ,...
స్వాగతం పలికిన గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ, మంత్రులు
అల్వాల్, మేడ్చల్, డిసెంబరు 17(ఆంధ్రజ్యోతి): రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శీతాకాల విడిది కోసం హైదరాబాద్ చేరుకున్నారు. బుధవారం మధ్యాహ్నం 2:55 గంటలకు ప్రత్యేక విమానంలో హకీంపేట్ ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌కు చేరుకున్న ముర్ముకు గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, త్రివిధ దళాలకు చెందిన అధికారులతో పాటు, మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, సీతక్క, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావు, డీజీపీ బి.శివధర్‌రెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ మనుచౌదరి, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతి తదితరులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ముర్ము రోడ్డు మార్గం ద్వారా బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి చేరుకున్నారు. 22 వరకు రాష్ట్రపతి ఇక్కడే బస చేసి నగరంలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు.
రేపటినుంచి పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ల జాతీయ సదస్సు
దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ల 2రోజుల జాతీయ సదస్సుకు రాష్ట్రం అతిథ్యమివ్వనుంది. ఈనెల 19న రామోజీ ఫిల్మ్‌సిటీలో జరగనున్న సదస్సును రాష్ట్రపతి ముర్ము ప్రారంభిస్తారని టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం తెలిపారు. 20న ముగింపు సమావేశానికి ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్, గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ, సీఎం రేవంత్ హాజరవుతారని చెప్పారు.