Share News

kumaram bheem asifabad- అన్ని ప్రాథమిక పాఠశాలలో పూర్వ ప్రాథమిక తరగతులు ప్రారంభించాలి

ABN , Publish Date - Jun 22 , 2025 | 11:13 PM

రాష్ట్రంలో అన్నీ ప్రాథమిక పాఠశాలలో వెంటనే పూర్వ ప్రాథమిక తరగతులు ప్రారంభించాలని టీఎస్‌యూటీఎఫ్‌ జిల్లా అధ్యక్షురాలు వైద్య శాంతికుమారి డిమాండ్‌ చేశారు. స్థానిక విశ్రాంత ఉద్యోగుల భవనంలో ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు.

kumaram bheem asifabad- అన్ని ప్రాథమిక పాఠశాలలో పూర్వ ప్రాథమిక తరగతులు ప్రారంభించాలి
మాట్లాడుతున్న టీఎస్‌యూటీఎఫ్‌ జిల్లా అధ్యక్షురాలు శాంతికుమారి

కాగజ్‌నగర్‌, జూన్‌ 22 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో అన్నీ ప్రాథమిక పాఠశాలలో వెంటనే పూర్వ ప్రాథమిక తరగతులు ప్రారంభించాలని టీఎస్‌యూటీఎఫ్‌ జిల్లా అధ్యక్షురాలు వైద్య శాంతికుమారి డిమాండ్‌ చేశారు. స్థానిక విశ్రాంత ఉద్యోగుల భవనంలో ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం 210 పాఠశాలలకు మాత్రమే పూర్వ ప్రాథమిక తరగతులు నిర్వహించేందుకు అనుమతి ఇచ్చినట్టు తెలిపారు. ఇందులో కూడా నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ లేకుండా ప్రారంభిస్తామని పేర్కొనడం సరికాదన్నారు. అన్ని ప్రాథమిక పాఠశాలలో పూర్వ ప్రాథమిక తరగతులు ప్రారంభించేట్టు తగిన చర్యలు తీసుకోవాలన్నారు.పెండింగ్‌ సమస్యలను కూడా పరిష్కరించేందుకు కృషి చేయాలని కోరారు. సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఊశన్న, కోశాధికారి రమేష్‌, ఉపాధ్యక్షుడు ఇందురావు, రమేష్‌, హేమంత్‌ షిండేతో పాటు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 22 , 2025 | 11:13 PM