kumaram bheem asifabad- పల్లె పోరుకు సన్నద్ధం
ABN , Publish Date - Nov 21 , 2025 | 10:02 PM
: జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల కు సన్నద్ధం చేస్తున్నారు. ఇటీవల రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) ఇప్పటికే పంచాయతీలు, వార్డుల వారీగా ఓటరు జాబితాను మరోసారి సవరించేం దుకు ప్రత్యేక కార్యాచరణ ప్రారంభించింది. ఇందుకు గాను ఈ నెల 20 నుంచి 23 వరకు గ్రామాల్లో ఓటరు జాబితా సవరణ కోసం రెండు రోజుల క్రితం షెడ్యూల్ ప్రకటించింది. 23న తుది జాబితాను ప్రకటించి ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉన్నందున గ్రామాల్లో రాజకీయం వేడెక్కుతోంది.
- రేపు తుది జాబితా ప్రకటన
- ఎన్నికలకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు
- గెలుపు కోసం ఆశావహుల యత్నం
చింతలమానేపల్లి, నవంబరు 21 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల కు సన్నద్ధం చేస్తున్నారు. ఇటీవల రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) ఇప్పటికే పంచాయతీలు, వార్డుల వారీగా ఓటరు జాబితాను మరోసారి సవరించేం దుకు ప్రత్యేక కార్యాచరణ ప్రారంభించింది. ఇందుకు గాను ఈ నెల 20 నుంచి 23 వరకు గ్రామాల్లో ఓటరు జాబితా సవరణ కోసం రెండు రోజుల క్రితం షెడ్యూల్ ప్రకటించింది. 23న తుది జాబితాను ప్రకటించి ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉన్నందున గ్రామాల్లో రాజకీయం వేడెక్కుతోంది. అధికారులు సైతం ఎప్పుడు నోటిఫికేషన్ వచ్చినా ఇబ్బంది లేకుండా ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. దీంతో ఆశావహులు ప్రజల్లోకి వెళుతూ ప్రచారం రప్రారంభించారు. జిల్లాలో 335 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వీటి పరిధిలో 2,874 వార్డుల్లో ఎన్నికలు నిర్వహించను న్నారు. జిల్లాలో మొత్తం ఓటర్లు 3,53,895 ఉన్నారు. ఇందులో పురుషులు 1,76,606, మహిళలు 1,77,269, ఇతరులు 20 మంది ఉన్నారు.
- పాలకవర్గాలు లేక..
జిల్లాలోని గ్రామ పంచాయతీల్లో పాలకవర్గాలు లేకపోవడంతో సమస్యలు పేరుకు పోతున్నాయి. పారిశుధ్యం, వీధి దీపాలు, ఇతర సమస్యలు రాజ్య మేలుతున్నాయి. 2019 జనవరిలో పంచాయతీ ఎన్నికలు జరగ్గా అదే యేడాది ఫిబ్రవరి 2న పాలక వర్గాలు బాధ్యతలు చేపట్టాయి. వీరి పదవీ కాలం 2024 ఫిబ్రవరి 1న ముగిసినప్పటికీ ఇప్పటి వరకు ఎన్నికలు జరగలేదు. దీంతో దాదాపు రెండేళ్లుగా ప్రత్యేక అధికారుల పాలన సాగుతోంది. 2019 మేలో జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. అదే యేడాది జూన్ 4వ తేదీన పరిషత్ పాలకవర్గాలు ఏర్పాటు అయ్యాయి. గత యేడాది జూన్‌తో పదవీ కాలం ముగియగా దాదాపుగా 17 నెలల నుంచి ఎన్నికలు జరగలేదు. దీంతో ఆయా గ్రామ పంచాయతీలకు 15వ ఆర్ధిక సంఘం నిధులు సైతం ఆగిపో యాయి. గ్రామాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులు దక్కాలంటే పంచా యతీల ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. కాగా ఎప్పటికప్పుడు గ్రామ పంచాయతీ, జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికలు త్వరలోనే జరుగుతా యంటూ హడావుడి చేయడం, ఆపై మరుగున పడడం సాధారణమైంది. ఐదారు నెలలుగా నేడో, రేపో నోటిఫికేషన్ వస్తుందని ఆయా పార్టీల ప్రజాప్రతినిధులు, నేతలతో సమావేశాలు నిర్వహించి దిశా నిర్ధేశం చేశారు. అధికార కాంగ్రెస్, బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీల నాయకులు ఆయా నియోజక వర్గాలలోని మండలాల వారీగా సమావే శాలు, పర్యటనలు సైతం పూర్తి చేస్తున్నారు. అయితే కులగణన, బీసీలకు 42శాతం రిజర్వేషన్లపై ప్రభుత్వ నిర్ణయంతో ఎన్నికలు నిర్వహిస్తామని నోటిఫికేషన్ ఇచ్చినట్టే ఇచ్చి హైకోర్టు తీర్పుతో వాయిదా పడ్డ విషయం విధితమే. ఎన్నికలు వాయిదా పడడంతో ఎన్నికలు ఎప్పుడు నిర్వహిం చేది తేలకపోవడంతో ఆశావహులు కూడా స్తబ్దం గా ఉండిపోయారు.
- ఎన్నికల సంఘం వైపు చూపు..
స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. మంత్రి మండలి లేఖ ఆధారంగా ఎన్నికల సంఘం సర్పంచ్ ఎన్నికలకు ఎప్పుడు నోటిఫికేషన్ విడుదల చేస్తుందోనన్న ఉత్కంఠ రాజకీయ వర్గాల్లో నెలకొంది. పాత పద్దతిలోనే ఎన్నికలు నిర్వహిస్తుండడంతో గతంలో పోటీ చేసిన నాయకులు సైతం పోటీకి సిద్ధమ వుతున్నారు. గతంలో ఇచ్చిన రిజర్వేషన్లే ఇస్తారా.. లేక మారుస్తారా అనుకున్న రిజర్వేషన్ వస్తుందో లేదోనన్న సందిగ్ధం పోటీ దారుల్లో నెలకొంది. ఒక వేళ రిజర్వేషన్ కలిసి రాకపోతే త్వరలో జరిగే జడ్పీటీసీ, ఎంపిటీసీలకు పోటీ చేసేందుకు ప్రణాళి కలు సిద్ధం చేస్తున్నారు. సర్పంచ్, వార్డు సభ్యుల వరకు ఎలాంటి రిజర్వేషన్ వస్తుందనే దానిపై రాజ కీయ పార్టీలతో పాటు ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొంది.