kumaram bheem asifabad- విద్యార్థులతో ప్రయోగాలకు సన్నద్ధం
ABN , Publish Date - Jul 21 , 2025 | 11:12 PM
విద్యార్థుల్లో సైన్స్‌సై ఆసక్తిని పెంచి భావి శాస్త్రవేత్తలుగా, ఆవిష్కరులుగా తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం ఏ ఏడాది అటల్ టింకరింగ్ ల్యాబ్ (ఏటీఎల్)లను ఏర్పాటు చేసింది. ఇందుకోసం కుమరం భీం జిల్లా వ్యాప్తంగా పీఎంశ్రీ పాఠశాలలను ఎంపిక చేశారు. ఆయా ఉపాధ్యాయులకు ఈనెల 17, 18 తేదీల్లో శిక్షణ కూడా పూర్తి చేశారు.
- పీఎంశ్రీ పాఠశాలలకు అటల్ టింకరింగ్ పథకంలో కేంద్రం నిధులు
- ప్రాజెక్టు ఆధారిత అభ్యాసానికి ప్రాధాన్యం
కాగజ్‌నగర్ టౌన్, జూలై 21 (ఆంరఽధజ్యోతి): విద్యార్థుల్లో సైన్స్‌సై ఆసక్తిని పెంచి భావి శాస్త్రవేత్తలుగా, ఆవిష్కరులుగా తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం ఏ ఏడాది అటల్ టింకరింగ్ ల్యాబ్ (ఏటీఎల్)లను ఏర్పాటు చేసింది. ఇందుకోసం కుమరం భీం జిల్లా వ్యాప్తంగా పీఎంశ్రీ పాఠశాలలను ఎంపిక చేశారు. ఆయా ఉపాధ్యాయులకు ఈనెల 17, 18 తేదీల్లో శిక్షణ కూడా పూర్తి చేశారు. ఈ విద్యా సంవత్సరంలో లాబ్‌లను సద్విని యోగం చేసుకునేందుకు విద్యార్థులకు ప్రయోగ పాఠాలు బోధించేందుకు ఉపాధ్యాయులకు జిల్లాలో శిక్షణ కార్యక్రమాలు ప్రారంభించారు. ఫిజిక్స్, బయాలజీ, గణిత శాస్త్ర ఉపాధ్యాయులకు శిక్షణ పూర్తి చేశారు. రెండు రోజుల శిక్షణలో ప్రత్యక్ష ప్రయోగాల నిర్వహణలో ప్రధానంగా డయోడ్స్, కెపాసిటర్లు, బ్రెడ్ బోర్డును ఉపయోగించి సర్క్యూట్ల తయారీ, డ్రోన్లను ఫోన్‌తో అనుసంధానం చేయడంతో పాటు నమూనా రోబొటిక్స్‌లను విడిభాగాలతో తయారు చేయించి ఆపరేట్ చేయించారు. 3డీ ముద్రణ విడిభాగాలతో ముద్రణ పరికరాన్ని తయారు చేయించి కంప్యూటర్ ద్వారా ఏలా ముద్రించాలో వివరించారు. అంతే కాక కొన్ని బొమ్మల ఆకారపు నమూనా 3డీ ముద్రణలను చేయించారు. ఆయా పరికరాల గురించి క్షుణ్ణంగా వివరించారు. ఏటీఎల్ ద్వారా విద్యార్థులు చిన్న వయస్సులోనే శాస్త్రవేత్తలు, ఆవిష్కర్తలుగా ఎదగడానికి అవసరమైన పునుదారిని ఏర్పరచాలనే ప్రభుత్వ ధ్యేయం. ఏటీఎల్ ద్వారా ప్రాజెక్టు ఆధారిత అభ్యాసానికి ప్రధాన్యం ఇవ్వనున్నారు.
- జిల్లా వ్యాప్తంగా..
జిల్లా వ్యాప్తంగా 14 పాఠశాలలు పీఎంశ్రీ కింద ఉండగా, జిల్లా కేంద్రంలో నిపుణులతో శిక్షణ ఇచ్చారు. కొత్తగా పీఎంశ్రీ పథకం కింద ఎంపికైన పాఠశాలల్లో అటల్ టింకరింగ్ ల్యాబ్‌లను ఏర్పాటు చేస్తున్నారు. గతంలో జిల్లా వ్యాప్తంగా విద్యార్థుల సంఖ్య, ఆయా పాఠశాలల నుంచి వచ్చిన ప్రతిపాదనల ఆధారంగా 14 పాఠశాలలు పీఎంశ్రీ కింద ఎంపికయ్యాయి. ఈ ల్యాబ్‌లకు రూ. 20 లక్షలు నిధులు మంజూరు కాగా, వీటిలో ఏటా రూ. 2లక్షల చొప్పున ఐదేళ్ల పాటు రూ. 10 లక్షలు మెయింటెనెన్స్ కింద నిధులు మంజూరు చేస్తారని జిల్లా సైన్స్ అధికారి కటుకం మధుకర్ తెలిపారు. ఈ నిధులతో కంప్యూటర్లు, రోబోటిక్స్, డ్రోన్లు తదితర పరికరాలు పంపిణీ చేస్తారు. ఎలకా్ట్రనిక్స్, ఎలక్ట్రికల్ పరికరాలు, టెలీస్కోప్, త్రీడి ప్రింటర్స్, ల్యాప్‌టాప్స్, ఏఐకు సంబంధిత, మెకానిక్, సేఫ్టీ టూల్స్, ఫైర్ పరికరాలు వంటివి ఒక్కో ల్యాబ్‌కు కేంద్ర ప్రభుత్వం సమకూరుస్తుంది. ఈ ల్యాబ్‌లు సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇంజనీరింగ్, గణితంలో పరిశోధనలకు తోడ్పాటుగా నిలుస్తాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా విద్యార్థులకు నూతన ఆవిష్కరణల రూపకల్పన, పరిశోధన రంగంపై ఆసక్తి కల్పించనున్నాయి.
ల్యాబ్‌ల ఏర్పాటుకు చర్యలు..
- మధుకర్, జిల్లా సైన్స్ అధికారి
అటల్ టింకరింగ్‌కు సంబంధించిన ల్యాబ్‌లు ఏర్పాటు చేసేందుకు అన్ని విధాలుగా ఏర్పాట్లు చేస్తున్నాం. ఇందులో భాగంగా ఈనెల 17, 18లో ఉపాధ్యాయులకు శిక్షణ పొం దారు. దీంతో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు శాస్త్ర, సాంకేతిక రంగాలపై పూర్తి అవ గాహన పెరుగుతుంది. నూతన ఆవిష్కరణలతో విద్యార్థుల్లో క్రియేటివిటీ పెరుగుతుంది. ఉపాధ్యాయులు కూడా ప్రయోగ పాఠాలు ఆసక్తితో బోధించేందుకు ఉపయోగకరం.