Share News

పత్తి కొనుగోళ్లకు సన్నద్ధం...

ABN , Publish Date - Oct 31 , 2025 | 11:19 PM

వానాకా లం సీజన్‌కు సంబంధించి పత్తి కొనుగోళ్లు సోమవా రం నుంచి ప్రారంభించనున్నారు. 2025-26 సంవత్స రానికి సంబంధించి సీసీఐ (కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా)ద్వారా జిల్లాలో పండిన పత్తిని కొనుగోలు చేయనున్నారు. జిల్లాలో మొత్తం 11 సెంటర్లు ఏర్పాటు చేయగా, వాటిలో తాండూరు మండలంలో 4, చెన్నూ రులో 6, లక్షెట్టిపేటలో ఒక కేంధ్రం ఉన్నాయి.

పత్తి కొనుగోళ్లకు సన్నద్ధం...

-ఏర్పాట్లు పూర్తి చేసిన అధికార యంత్రాంగం

-అతివృష్టి కారణంగా దిగుబడిపై ప్రభావం

-కపాస్‌ కిసాన్‌ యాప్‌లో వివరాల నమోదు తప్పనిసరి

-యాప్‌, స్లాట్‌ బుకింగ్‌పై రైతులకు అవగాహన లేమి

-అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయని యంత్రాంగం

మంచిర్యాల, అక్టోబరు 31 (ఆంధ్రజ్యోతి): వానాకా లం సీజన్‌కు సంబంధించి పత్తి కొనుగోళ్లు సోమవా రం నుంచి ప్రారంభించనున్నారు. 2025-26 సంవత్స రానికి సంబంధించి సీసీఐ (కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా)ద్వారా జిల్లాలో పండిన పత్తిని కొనుగోలు చేయనున్నారు. జిల్లాలో మొత్తం 11 సెంటర్లు ఏర్పాటు చేయగా, వాటిలో తాండూరు మండలంలో 4, చెన్నూ రులో 6, లక్షెట్టిపేటలో ఒక కేంధ్రం ఉన్నాయి.

వానాకాలం దిగుబడి అంచనా...

జిల్లా వ్యాప్తంగా వానాకాలం పత్తి సీజన్‌కు సంబం ధించి 1,61,193 ఎకరాల్లో రైతులు పత్తిపంట సాగు చేశారు. ఎకరాకు సగటున 8 క్వింటాళ్ల మేర దిగుబడి వస్తుందని అంచనా వేస్తుండగా, మొత్తంగా 13,33, 811.2 క్వింటాళ్ల పత్తి రైతుల చేతికి వస్తుందని భావి స్తున్నారు. మండలాల వారీగా పత్తి సాగు, దిగుబడి అంచనా ఇలా ఉంది...

మండలం సాగు విస్తీర్ణం (ఎకరాల్లో) దిగుబడి (క్వింటాళ్లలో)

బెల్లంపల్లి 6503 52674.3

కాసిపేట 12400 105400

తాండూరు 15121 126905

భీమిని 23190 197115

కన్నెపల్లి 16963 135704

నెన్నెల 9600 76800

వేమనపల్లి 8314 67343.4

కోటపల్లి 19625 162887.5

చెన్నూరు 12890 108276

జైపూరు 6190 51377

భీమారం 4250 34425

మందమర్రి 6600 54120

మంచిర్యాల 480 3840

నస్పూర్‌ 50 400

హాజీపూర్‌ 5880 48804

లక్షెట్టిపేట 5608 44864

దండేపల్లి 4000 32000

జన్నారం 3720 30876

అతివృష్టితో దిగుబడిపై ప్రభావం...

ఈ ఏడాది కురిసిన అధిక వర్షాలు పత్తి దిగుబడిపై ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు రైతులు దిగాలు చెందుతున్నారు. పత్తి సాగు చేసినప్పటి నుంచి పలు దఫాలుగా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. మొదట్లో భా రీ వర్షాల కారణంగా వరదలు సంభవించి అధిక మొ త్తంలో పత్తి చేలు నీట మునిగాయి. మొక్క ఎదిగే దశ లో నీటిలో మునగడం వల్ల కొన్ని చోట్ల వాడిపోయిన ష్టం వాటిళ్లగా, ప్రస్తుతం కురుస్తున్న అకాల వర్షాల కా రణంగా పత్తి రంగుమారి నాణ్యత కోల్పోవడంతో పా టు దిగుబడి తగ్గుతుందనే ఆందోళనలు వ్యక్తమవుతు న్నాయి. దీంతో పెట్టుబడులు కూడా చేతికి వస్తాయో... లేదోనన్న ఆందోళనలో రైతులు ఉన్నారు. పత్తి సాగు చే సింది మొదలు, పంట చేతికి వచ్చే దాకా ఎకరాకు సగటున రూ. 40వేల వరకు ఖర్చు చేయాల్సి వస్తోం దని రైతులు చెబుతున్నారు. ఎకరాకు కనీసం 10 క్విం టాళ్ల దిగుబడి వచ్చినా అన్ని ఖర్చులు పోను రూ. 20వేల చొప్పున మిగిలుతుందని చెబుతున్నారు. అయి తే ఏ యేడు అతివృష్టితో దిగుబడిపై ప్రభావం చూపు తుందనే అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఎడతె రపి లేకుండా భారీ వర్షాలు కురియడంతో మొలక దశ లోనే పత్తి పంటకు తీరని నష్టం వాటిల్లినట్లు చెబుతు న్నారు. ఇదిలా ఉండగా, సంవత్సరం ఎకరాకు గరిష్టం గా 8 క్వింటాళ్లు కూడా దిగుబడి వచ్చే పరిస్థితి లేదని, సాగు ఖర్చులు కూడా గిట్టుబాటు కావని చెబుతున్నా రు. ఏ యేడు పత్తికి క్వింటాలుకు రూ. 8,110 మద్దతు ధర ప్రకటించారు. గత ఏడాది క్వింటాలు పత్తి మద్దతు ధర రూ. 7521 ఉండగా, ఈ సంవత్సరం అంతకంటే రూ. 589 ఎక్కువగా పెంచారు.

కపాస్‌ కిసాన్‌ యాప్‌లో వివరాలు నమోదు...

సీసీఐకు పత్తి విక్రయించేందుకు ప్రభుత్వం రూపొం దించిన కపాస్‌ కిసాస్‌ యాప్‌లో సంబంధిత రైతులు తమ వివరాలు విధిగా నమోదు చేసుకోవాలి. వివరా లు నమోదయ్యాక స్లాట్‌ బుక్‌ చేసుకుంటే రైతులకు పత్తి విక్రయం సులువుగా ఉండే అవకాశం ఉంది. జి న్నింగ్‌ మిల్లుల వెంట రోజుల తరబడి తిరగాల్సిన అవ సరం లేకుండా స్లాట్‌ బుకింగ్‌ ఉపయోగపడుతుందని అధికారులు చెబుతున్నారు. అయితే చాలా మంది రై తులకు కపాస్‌ కిసాన్‌ యాప్‌పై పూర్తిస్థాయిలో అవ గాహన లేకపోవడంతో ఇప్పటి వరకు ఇంకా వివరాలు నమోదు చేసుకోలేదని సమాచారం. అలాగే స్లాట్‌ బు కింగ్‌పై కూడా అధికారులు రైతులకు అవగాహన క ల్పించాల్సిన అవసరం ఉంది.

Updated Date - Oct 31 , 2025 | 11:19 PM