kumaram bheem asifabad- పరిషత్ ఎన్నికలకు ముమ్మర ఏర్పాట్లు
ABN , Publish Date - Oct 05 , 2025 | 10:41 PM
మండల, జిల్లా పరిషత్తు ఎన్నికల దిశగా అధికార యంత్రాంగం ముమ్మర కసరత్తు చేస్తోంది. మొదటి విడతలో జిల్లాలోని ఎనిమిది మండలాల జడ్పీటీసీ స్థానాలకు, 71 ఎంపీటీసీ స్థానాలకు, రెండో విడతలో 7 మండలాల లోని 7 జడ్పీటీసీలతో పాటు ఆ మండలాల పరిధిలోని 56 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు వీలుగా అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమ య్యారు.
ఆసిఫాబాద్, అక్టోబరు 5 (ఆంధ్రజ్యోతి): మండల, జిల్లా పరిషత్తు ఎన్నికల దిశగా అధికార యంత్రాంగం ముమ్మర కసరత్తు చేస్తోంది. మొదటి విడతలో జిల్లాలోని ఎనిమిది మండలాల జడ్పీటీసీ స్థానాలకు, 71 ఎంపీటీసీ స్థానాలకు, రెండో విడతలో 7 మండలాల లోని 7 జడ్పీటీసీలతో పాటు ఆ మండలాల పరిధిలోని 56 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు వీలుగా అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమ య్యారు. 9వ తేదిన నోటిఫికేషన్ వెలువడినప్పటి నుంచే నామినేఫన్లు స్వీకరించాల్సి ఉండడంతో ఇందుకు తగిన సదుపాయా లు మండలాల వారీగా ఏర్పాటు చేస్తున్నారు. ఎన్నికల నిర్వహ ణపై జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే ఆయా విభాగాల అధికారులతో సమీక్షలు నిర్వహించి ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించేందుకు దిశానిర్ధేశం చేస్తున్నారు. జిల్లాలోని పరిస్థితులను ఎప్పటికప్పుడు రాష్ట్ర ఎన్నికల సంఘానికి నివేదిస్తున్నారు. ఇప్పటికే జిల్లాలో ఎన్నికల పోలింగ్‌కు సంబందించి ప్రిసైడింగ్, సహాయ ప్రిసైడింగ్ అదికారులకు శిక్షణ పూర్తి చేశారు.
- మొదటి విడతలో..
జిల్లాలో మొదటి విడతలో 8 మండలాలలోని 8 జడ్పీటీసీలతో పాటు ఆ మండలాల పరిధిలోని 71 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహంచనున్నారు జిల్లాలో రెండు రెవెన్యూ డివిజన్‌లు ఉండగా మెదటి విడతలో ఒక డివిజన్ ,రెండో విడతలో మరో డివిజన్‌లో ఎన్నికలు జరిపే విధంగా అధికారులు ప్రణాళికలు రూపొందించారు. మొదటి విడతలో కాగజ్‌నగర్ రెవె న్యూ డివిజన్ పరిధిలోని కాగజ్‌నగర్, సిర్పూర్(టి), కౌ టాల, చింతలమానేపల్లి, బెజ్జూరు, దహెగాం, పెంచికల పేటతో పాటు ఆసిఫాబాద్ రెవెన్యూ డివిజన్‌లోని రెబ్బెన మండలంలో ఎన్నికలు నిర్వహించేందుకు నిర్ణయించారు. రెండో విడతలో ఆసిఫాబాద్ రెవెన్యూ డివిజన్‌లోని 7 మండలాలలోని 7 జడ్పీటీసీలతో పాటు ఆ మండలాల పరిధిలోని 56 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహిం చనున్నా రు. ఆసిఫాబాద్, వాంకిడి, కెరమెరి, తిర్యాణి, జైనూర్, సిర్పూర్(యు), లింగాపూర్ మండలాలలో ఎన్నికల నిర్వహణకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.
జడ్పీటీసీ, ఎంపీపీల రిజర్వేషన్ల వివరాలు ఇలా..
క్రమ సంఖ్య మండలం జడ్పీటీసీ ఎంపీపీ
1. ఆసిఫాబాద్ ఎస్టీ(జనరల్) ఎస్టీమహిళ
2. సిర్పూర్(యూ) జనరల్ ఎస్టీ మహిళ
3. లింగాపూర్ జనరల్ మహిళ ఎస్టీ మహిళ
4. జైనూరు బీసీ జనరల్ ఎస్టీ జనరల్
5. తిర్యాణి బీసీ మహిళ జనరల్
6. కెరమెరి బీసీ జనరల్ జనరల్ మహిళ
7. వాంకిడి ఎస్టీ మహిళ ఎస్టీ జనరల్
8. రెబ్బెన బీసీ మహిళ బీసీ జనరల్
9. బెజ్జూరు ఎస్టీ జనరల్ ఎస్టీ జనరల్
10. పెంచికలపేట ఎస్సీ మహిళ ఎస్సీ మహిళ
11. కాగజ్‌నగర్ బీసీ మహిళ బీసీ మహిళ
12. కౌటాల బీసీ జనరల్ బీసీ జనరల్
13. చింతలమానేపల్లి ఎస్టీ జనరల్ బీసీ మహిళ
14. దహెగాం ఎస్టీ మహిళ ఎస్సీ జనరల్
15. సిర్పూర్(టి) ఎస్సీ జనరల్ బీసీ జనరల్