kumaram bheem asifabad- ‘పరిషత్’కు సన్నద్ధం
ABN , Publish Date - Aug 06 , 2025 | 11:24 PM
మం డల పరిషత్ ఎన్నికల నిర్వహణకు యంత్రాంగం సన్నద్ధమవు తోంది. నోటిఫికేషన్ ఈనెల 10 తర్వాత ఏ క్షణమైన వచ్చే అవకాశాలు న్నాయన్న సంకేతంతో అధికారులు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే పోలింగ్ కేంద్రాలు, బ్యాలెట్ బాక్స్‌లు, నామి నేషన్ పత్రాలు, అధికారులు, సిబ్బంది నియామకంతో పాటు కౌంటింగ్‌కు కేంద్రాలను ఏర్పాటు చేశారు.
- అందుబాటులోకి ఎన్నికల సామగ్రి
- పోలింగ్ సిబ్బంది నియామకం పూర్తి
- ఎన్నికల కమిషన్‌కు నివేదిక
ఆసిఫాబాద్‌రూరల్, ఆగస్టు 6 (ఆంధ్రజ్యోతి): మం డల పరిషత్ ఎన్నికల నిర్వహణకు యంత్రాంగం సన్నద్ధమవు తోంది. నోటిఫికేషన్ ఈనెల 10 తర్వాత ఏ క్షణమైన వచ్చే అవకాశాలు న్నాయన్న సంకేతంతో అధికారులు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే పోలింగ్ కేంద్రాలు, బ్యాలెట్ బాక్స్‌లు, నామి నేషన్ పత్రాలు, అధికారులు, సిబ్బంది నియామకంతో పాటు కౌంటింగ్‌కు కేంద్రాలను ఏర్పాటు చేశారు.
- జిల్లా వ్యాప్తంగా..
జిల్లాలో 127 ఎంపీటీసీ, 15 జడ్పీటీసీ స్థానాలు ఉన్నాయి. వీటికి రెండు దశల్లో ఎన్నికల నిర్వహణకు అధికారులు ప్రతిపాదనలు రూపొందించారు. తొలి విడతలో ఆసిఫాబాద్ డివిజన్‌లోని ఆసిఫాబాద్, రెబ్బెన, తిర్యాణి, వాంకిడి, కెరమెరి, జైనూరు, సిర్పూర్(యూ), లింగాపూర్ జడ్పీటీసీ స్థానాలు. వీటి పరిధిలోని 66 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. రెండో విడతలో కాగజ్‌నగర్ డివిజన్‌లోని కాగజ్‌నగర్, సిర్పూర్(టి), కౌటాల, చింతలమానేపల్లి, పెంచికల్‌పేట, దహెగాం, బెజ్జూరు జడ్పీటీసీ స్థానాలు, వీటి పరిధిలోని 61 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించేలా ప్రతిపాదించారు. అలాగే ఓట్ల లెక్కింపును సైతం రెండు చోట్ల నిర్వహించనున్నారు. ఆసిఫాబాద్, సిర్పూర్ కేంద్రాలలో ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నారు.
- పోలింగ్ కేంద్రం..
పోలింగ్ కేంద్రం 600 ఓటర్లకు ఒకటి చొప్పున ఏర్పాటు చేయనున్నారు. ప్రతి జడ్పీటీసీ స్థానానికి ఒక రిటర్నింగ్ అధికారి, ఎంపీటీసీ స్థానానికి రిటర్నింగ్ అధికారి, ఏఆర్‌వో ఉంటారు. అదే విధంగా 200 మంది ఓటర్లు ఉండే పోలింగ్ కేంద్రంలో ఒక ప్రిసైడింగ్ అధికారి, పోలింగ్ అధికారి, 201 నుంచి 400 మంది ఓటర్లుండే కేంద్రంలో ఒక ప్రిసైడింగ్, ఇద్దరు పోలింగ్ అధికారులు నియమించనున్నారు. 401 నుంచి 600 ఓటర్లు ఉండే పోలింగ్ కేంద్రంలో ఒక ప్రిసైడింగ్, ముగ్గురు పోలింగ్ అధికారులు ఉంటారు. ఈ కేంద్రాలలో 4,706 మంది అవసరమున్నట్లు జాబితాను సిద్ధం చేశారు. కాగా జిల్లాలో 3,54,691 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుషులు 1,77,105, మహిళలు 1,77,567 మంది, ఇతరులు 19 మంది ఉన్నారు. వీరి కోసం 693 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఎన్నికల నిర్వహణకు 1,260 బ్యాలేట్ బాక్సులను సిద్ధం చేశారు.
ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నాం..
- భిక్షపతిగౌడ్, జిల్లా పంచాయతీ అధికారి
నోటిఫికేషన్ ఎప్పుడొచ్చినా ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నాం. ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి. మండలాలకు ఎన్నికల సామగ్రిని చేరవేశాం. ఓట రు జాబితాలను సిద్ధం చేస్తున్నాం. రాష్ట్ర ఎన్నికల కమి షన్‌కు నివేదిక కూడా పంపించాం.