కూడళ్లలో దేవుళ్ల విగ్రహాల ఏర్పాటుకు సన్నాహాలు
ABN , Publish Date - Jul 11 , 2025 | 12:55 AM
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం పరిధిలో కొండకింద ప్ర ధాన కూడళ్లకు దేవుళ్ల నామకరణం చేసేందుకు దేవాదాయ కమిషనర్, ఆలయ ఈవో ఎస్. వెంకట్రావు సంకల్పించారు.
కూడళ్లలో దేవుళ్ల విగ్రహాల ఏర్పాటుకు సన్నాహాలు
అధికారులతో ఆలయ ఈవో సమీక్ష
యాదగిరిగుట్ట, జూలై 10 (ఆంధ్రజ్యోతి): యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం పరిధిలో కొండకింద ప్ర ధాన కూడళ్లకు దేవుళ్ల నామకరణం చేసేందుకు దేవాదాయ కమిషనర్, ఆలయ ఈవో ఎస్. వెంకట్రావు సంకల్పించారు. ఈ మేరకు గత నెల 12వ తేదీన వైకుంఠద్వారం కూడలికి (సర్కిల్) అభయాంజనేయ, సూట్ కూడా కూడలికి గరుడ, కొండపైకి వెళ్లే టోల్‌గేట్ వద్ద కూడలికి రామానుజ, గండిచెరువు సమీపంలో (మల్లాపురం వెళ్లే రోడ్డు) యాదర్షి నామకరణం చేశారు. కొండ చుట్టూ ఉన్న ప్రధాన కూడళ్లకు దేవుళ్ల పేరుతో నామకరణం చేస్తే సుదూర ప్రాంతాల నుంచి ఇక్కడకు తరలివచ్చే భక్తులు గుర్తింపునకు చౌరస్తాలకు నామకరణం చేసినట్లు ఈవో వెల్లడించారు. ప్రధానంగా కూడళ్లలో దేవుళ్ల విగ్రహాల ఏర్పాటు సన్నాహాలు మొదలుపెట్టారు. ఇందులో భాగంగా గురువారం విగ్రహాలను ఏర్పాటు చేసేందుకు కొండ చుట్టూ కూడళ్లను పరిశీలించి ఎటు వైపు నిలపాలని సమీక్షలో చర్చ జరిపారు. సమీక్షలో అనువంశిక ధర్మకర్త భాస్కరాయణ నరసింహమూర్తి, డీఈవో దోర్భల భాస్కరశర్మ, ప్రధానార్చకులు నల్లందీగల్ లక్ష్మీనరసింహచార్యులు, కాండూరి వెంకటాచార్యులు, స్తపతులు వల్లినయగం, బాలసుబ్రమణ్యం, సివిల్ విభా గం ఈఈ జిల్లెల దయాకర్‌రెడ్డి, ఎలకి్ట్రకల్ ఈఈ వెంకటరామరావు, సివిల్ ఏఈ గూడెం శ్రీనివా్‌సరెడ్డి, ఎస్పీఎఫ్ ఇన్సపెక్టర్ శేషగిరిరావు ఉన్నారు. వన మహోత్సవంలో భాగంగా గురువారం కొండకింద ఆధ్యాత్మిక వాడల్లో వ్రత మండపం, కల్యాణకట్ట, అన్నదానసత్రం తదితర ప్రదేశాల్లో ఈవో ఆదేశాల మేరకు పనస, కదంబ, వేప, ఉసిరి మొక్కలు నాటారు. కార్యక్రమంలో ఏఈవో గజ్వేల్లి రమే్‌షబాబు, ఆలయ, ఎస్పీఎఫ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.