kumaram bheem asifabad- పత్తి కొనుగోళ్లకు సన్నద్ధం
ABN , Publish Date - Sep 26 , 2025 | 10:49 PM
జిల్లాలో పత్తి పంటను మద్దతు ధరతో కొనుగోలు చేసేందుకు సీసీఐ ఎనిమిది కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఈ మేరకు ఆయా కేంద్రాల్లో ఏర్పాటు చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. మార్కెట్ అధికారులు సమావేశాలు ఏర్పాటు చేసి కొనుగోలు కేంద్రాలల్లో సౌకర్యాలు, మార్గదర్శకాలు, ఇతర మౌళిక వసతులు తదితర వాటిపై ఆరా తీశారు.
- ఈ ఏడాది 3.5 లక్షల ఎకరాల్లో పత్తి పంట సాగు
- ఇప్పటికే రైతులు సాగు చేసిన పంట వివరాలు నమోదు చేస్తున్న అధికారులు
చింతలమానేపల్లి, సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో పత్తి పంటను మద్దతు ధరతో కొనుగోలు చేసేందుకు సీసీఐ ఎనిమిది కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఈ మేరకు ఆయా కేంద్రాల్లో ఏర్పాటు చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. మార్కెట్ అధికారులు సమావేశాలు ఏర్పాటు చేసి కొనుగోలు కేంద్రాలల్లో సౌకర్యాలు, మార్గదర్శకాలు, ఇతర మౌళిక వసతులు తదితర వాటిపై ఆరా తీశారు. రెబ్బెన మండలంలోని కొండపల్లి, వాంకి డి, ఆసిఫాబాద్‌లో రెండు కేంద్రాలు, జైనూరు, కాగజ్‌నగర్, సిర్పూర్(టీ), కౌటాలలో ఏర్పాటు కానున్నాయి. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర కంటే మార్కెట్లో తక్కువ ధర ఉంటే సీసీఐ కొనుగోలు పత్తిని కొనుగోలు చేస్తుంది. ఎక్కువ ధర ఉంటే సీసీఐ అవసరం ఉండదు. రైతులు నేరుగా వ్యాపారులకే విక్రయిస్తారు. విపణిలో తక్కువ ధర ఉండి, ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో ఎక్కవ ధర ఉంటే క్రయ విక్రయాల్లో అక్రమాలు చోటు చేసు కుంటాయి. బినామీల పేరున విక్రయాలు జరిగే అవకాశం ఉంటుందన్న ఆరోపణలున్నాయి. అయితే ఈ ఏడాది పత్తి కొనుగోలు కేంద్రాల్లో ఎలాంటి తప్పులకు తావివ్వకుండా మరింత పక్కాగా పత్తి విక్రయాలను జరుపాలని ఇందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలో ఈ ఏడాది 4.5 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగవుతుండగా అందులో మెజార్టీ స్థాయిలో 3,35,363 ఎకరాల్లో పత్తి పంటనే సాగు చేస్తున్నారు. దీని ద్వారా 35 లక్షల క్వింటాళ్లపైనే దిగుబడి అంచనా వేస్తుండగా వాతావరణ పరిస్థితులు, అధిక వర్షాల కారణంగా దిగుబడిలో హెచ్చు తగ్గులు ఉండే అవకాశం ఉన్న ది. ఇప్పటికే రైతులు సాగు చేసిన పంట వివరాలు అధికారులు నమోదు చేస్తున్నారు.
- మద్దతు ధరపై అసంతృప్తి..
ఆరుగాలం కాయ కష్టం చేసి, పండించిన పంటలకు కనీస మద్దతు ధర రావడం లేదని కొంతకా లంగా రైతులు వాపోతున్నారు. ఈ సంవత్సరం కూడా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విధంగా పత్తిపంట మద్దతు ధరలు కూడా కంటి తుడుపు చర్యగానే ఉన్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతు న్నాయి. ఈయేడు పత్తికి క్వింటాలుకు 8,110 రూ పాయల మద్దతు ధర ప్రకటించారు. గత ఏడాది క్వింటాలు పత్తి మద్దతు ధర 7,521 రూపాయలు ఉండగా, ఈ సంవత్సరం అంతకంటే 589 రూపాయలు ఎక్కువగా పెంచుతూ నిర్ణయం తీసుకున్నా రు. ప్రభుత్వం నిర్ణయించిన ధరకు సీసీఐలో విక్ర యాలు జరిపితే కష్టమే మిగులు తుందని, ప్రైవేటు ఆశ్రయించడమే మేలన్న ఆలోచనలో రైతు లు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రైవేటు మార్కెట్లో ధర ఎక్కువ లభించే అవకాశాలు ఉండడంతో అటువై పే రైతులు మొగ్గు చూపాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. సాగు ఖర్చులు పెరగడం, దిగుబడి తగ్గే అవకాశాలు ఉండటంతో గిట్టుబాటు ధర కోసం రైతులు వేచి ఉండే అవకాశాలు ఉన్నాయి.
- కొనుగోళ్లకు కొత్త యాప్..
కసాస్ కిసాన్ పేరిట సీసీఐ కొత్త యాప్‌ను ప్రవేశపెట్టింది. స్లాట్ బుకింగ్ ద్వారా పత్తి కొనుగో లు చేపట్టి జాప్యాన్ని నివారించేందుకు చర్యలు చేపట్టనున్నారు. రైతులు నేరుగా ప్లే స్టోర్ నుండి కిసాన్ కపాస్ పేరిట ఉన్న యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. పట్టాదారు పాసు పుస్తకంతో పాటు పత్తి సాగు చేసిన భూమి సర్వేనంబర్., ఆధార్, ఇతర వివరాలు నమోదు చేసుకోవాలి. లేకుంటే ఆ యా క్లస్టర్ల పరిధిలో ఉంటే ఏఈవోల వద్ద నమో దు చేసుకోవచ్చని అధికారులు చెబుతున్నారు.