సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి
ABN , Publish Date - Aug 08 , 2025 | 11:41 PM
గ్రామాల్లో సీజ నల్ వ్యాధులు వ్యాప్తి చెందకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని, ఇందుకు గాను గ్రామాల్లో ముమ్మరంగా పా రిశుధ్య పనులను చేపట్టాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించిన ఆయన వార్డులు, మం దుల నిల్వలు, పరిసరాలను పరిశీలించారు.
కలెక్టర్ కుమార్ దీపక్
కోటపల్లి, ఆగస్టు 8 (ఆంధ్రజ్యోతి) : గ్రామాల్లో సీజ నల్ వ్యాధులు వ్యాప్తి చెందకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని, ఇందుకు గాను గ్రామాల్లో ముమ్మరంగా పా రిశుధ్య పనులను చేపట్టాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించిన ఆయన వార్డులు, మం దుల నిల్వలు, పరిసరాలను పరిశీలించారు. సీజనల్ వ్యా ధులు వ్యాప్తి చెందకుండా పాటించాల్సిన జాగ్రత్తల ను ప్రజలకు వివరించాలని, అవసరమైన మందుల నిల్వల ను అందుబాటులో ఉంచుకోవాలని, ఆసుపత్రికి వచ్చే ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించాలని సూచించా రు. అలాగే ఆసుపత్రిలోని వార్డులను పరిశుభ్రంగా ఉం చాలని, వైద్యులు, సిబ్బంది విధుల పట్ల సమయ పాలన పాటించాలని సూచించారు. బొప్పారం గ్రా మంలో కొనసాగుతున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పరిశీలించారు. గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠ శాలను సందర్శించిన ఆయన ప్రహారీ నిర్మాణానికి అవ సరమైన ప్రతిపాదనలు సిద్దం చేసి అందించాలని అధి కారులను ఆదేశించారు. అనంతరం మండల కేంద్రంలో ని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని సందర్శిం చిన కలెక్టర్ వంట శాల, తరగతి గదులు, విద్యార్థులకు అందించే ఆహారం నాణ్యత, మూత్రశాలలు, హాజరు ప ట్టిక, పరిసరాలను పరిశీలించారు. 6,7 తరగతుల విద్యా ర్థినులకు గణితం సబ్జెక్టుపై బోధించిన కలెక్టర్ పలు ప్ర శ్నలు అడిగి విద్యార్థినుల సామర్ధ్యాలను అంచనా వేశా రు. చివరగా తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించిన కలెక్టర్ రికార్డులు, రిజిష్టర్‌లను పరిశీలించారు. భూభా రతి రెవెన్యూ సదస్సులో అందిన దరఖాస్తులను పరిశీ లించి పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని సూ చించారు. ఉద్యోగులు విధుల పట్ల బాధ్యత గా వ్యవహ రించాలన్నారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ రాఘవేందర్ రావు, ఎంపీడీవో నాగేశ్వర్‌రెడ్డి, సిబ్బంది ఉన్నారు.